Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆసిఫాబాద్
జిల్లా కేంద్రంలోని రెండు ప్రైవేటు జూనియర్ కళాశాలలో స్వాగతోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని మాతృశ్రీ జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలు జనకాపూర్లోని తాటియా గార్డెన్లో నిర్వహించగా ముఖ్యఅతిథిగా డీఐఈఓ శ్రీధర్ సుమన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు ఎంచుకుని వాటిని సాధించే దిశగా ప్రయత్నాలు చేయాలని సూచించారు. ఇంటర్మీడియట్ దశ ఎంతో గొప్పదని సరైన జీవిత లక్ష్యం ఎంచుకునే సమయం అని అన్నారు. అనంతరం విద్యార్థులు చేసిన సంస్కృక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం బాలాజీ, లింగమూర్తి, పవన్, ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.
శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో
శ్రీ చైతన్య జూనియర్ కళాశాల ప్రిషర్స్ డే వేడుకలు ఎస్ఎం గార్డెన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జడ్పీటీసీ అరిగెల నాగేశ్వరరావు హాజరయ్యారు. ఆయనకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ప్రథమ సంవత్సరం విద్యార్థులకు స్వాగతం పలికారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ రాజశేఖర్, ప్రిన్సిపాల్ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ సత్యనారాయణ, నాయకులు నిస్సార్, అధ్యాపక బృందం పాల్గొన్నారు.