Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భైంసా
పేదింటి ఆడపడుచులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి అన్నారు. శనివారం భైంసాలోని ఎంపీడీఓ కార్యాలయంలో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ మహిళ సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. స్వయం సహాయక సంఘాలకు స్త్రీనిధి ద్వారా తక్కువ వడ్డీతో రుణాలను అందిస్తోందని తెలియజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కల్పన గణేష్, ఎంపీడీఓ గంగాధర్, వైస్‌ఎంపీపీ గంగాధర్, నాయకులు భీంరావ్ సొలంకి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు అధికారులు పాల్గొన్నారు.
కుభీర్:మహిళలు ఆనందంగా బతుకమ్మ పండుగను నిర్వహించుకోవాలని ఎంపీపీ తూము లక్ష్మీబాయి, జెడ్పీటీసీ అల్కతాయి అన్నారు. శనివారం మండల కేంద్రంతో పాటు పార్డి(బి), పల్సి, సౌనతో గ్రామ పంచాయతీల్లో స్థానిక సర్పంచ్‌లు, ఎంపీటీసీలు నాయకుల ఆధ్వర్యంలో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలానికి 18 వేలకు పైగా బతకమ్మ చీరలను ప్రతి పేదింటి ఆడపడుచుకలకు అండగా ఉండేందుకే బతకమ్మ చీరలను పంపిణీ చేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌లు తూము పుష్పాలత, రాజేశ్వర్, మీరా విజరు కుమార్, కవిత, రాజేష్, వైస్ ఎంపీపీ మోహినుద్దీన్, శంకర్ చవాన్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అనిల్ మండల రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు పుప్పాల పీరాజి, ఐకేపీ అధికారులు మహిళలు పాల్గొన్నారు.
జైనథ్:మండలంలోని కాప్రి గ్రామంలో శనివారం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. దీనికి ముఖ్యఅతిథిగా అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ హాజరయ్యారు. స్థానిక నాయకులతో కలిసి చీరల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బతుకమ్మ పండుగను ధనిక, పేద వర్గాలు అనే తేడాలేకుండా సీఎం కేసీఆర్ ఆడపడుచులు ఆనందంగా గడపాలని చీరల పంపిణీ చేపట్టారని అన్నారు. వీటిని మన రాష్ట్రంలో ఉన్న చేనేత కార్మికులచే తయారు చేయించి, వారికి ఉపాధి కల్పిస్తున్నారని అన్నారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చేస్తామని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మరిశెట్టి గోవర్ధన్, జెడ్పీటీసీ తుమ్మల అరుంధతి వెంకటరెడ్డి, ఎంపీటీసీ రామ్‌రెడ్డి, సర్పంచ్ రామీలా వెంకటరెడ్డి, ఎంపీడీఓ గజానన్, తహసీల్ధార్ రాఘవేంద్రరావు పాల్గొన్నారు.
అదిలాబాద్ రూరల్:గత ప్రభుత్వాలు ప్రజలతో రాజకీయం చేయడమే తప్ప వారి ఆత్మగౌరవం పట్ల పాటుపడలేదని మున్సిపల్ వైస్‌చైర్మెన్ జహిర్ రంజాని అన్నారు. శనివారం పట్టణంలోని నాల్గో వార్డులో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఎర్పడిన తరువాత ఆడపడుచులకు బతుకమ్మ చీరలు పంపిణీ చేసి వారి ఆత్మగౌరవాన్ని కాపాడుతోందని అన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు అజరు, కౌన్సిలర్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ శైలజ పాల్గొన్నారు.
మండలంలోని బట్టిసావర్గాం, మావల గ్రామాలలో శనివారం బతుకమ్మ చీరలను జెడ్పీటీసీ నల్ల వనితారాజేశ్వర్, ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు రాగం గంగమ్మ, దొగ్గలి ప్రమీల, ఎంపీటీసీ దర్శనాల సంగీత, తహసీల్దార్ వనజారెడ్డి, నాయకులు చందాల రాజన్న, దొగ్గలి రాజేశ్వర్, రాగం గోవర్ధన్, ఏవన్, గంగుల కిరణ్, అజీమ్ ఖాన్, గంగన్న, ఆర్ఐ అమృత్ పాల్గొన్నారు.
మండలంలోని ఖండాల, లోహార, లోకారి, తిప్ప, అసోద, బుర్కి, గ్రామాలలో శనివారం బతుకమ్మ చీరలను ఇన్చార్జి ఎంపీపీ గండ్రత్ రమేష్, మహిళలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, అనేక సంక్షేమ కార్యక్రమాలను వివరించారు, ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ మెట్టు ప్రహ్లాద్, పీఏసీఎస్ చైర్మెన్ మెస్రం పరమేశ్వర్, ఆరె నరేష్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు సోనేరావు, ఎంపీటీసీ మాడ సూరక్క, జంగు పటేల్, సర్పంచ్‌లు మడవి అశోక్, టీఆర్ఎస్ కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.