Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నస్ఫూర్
మావోయిస్టు పార్టీ వారోత్సవాలు సందర్భంగా శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్కే6 కొత్త రోడ్ అరుణక్కనగర్, కటిక దుకాణాలు ఏరియాలలో ఎస్సై మానస ముమ్మర తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ శ్రీరాంపూర్ సీఐ బి. రాజు ఆదేశాల మేరకు తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. అనుమానితులు ఎవరైనా కనిపిస్తే 100కు డయల్ చేయాలని శ్రీరాంపూర్ ఏరియాలో మావోయిస్టుల సంచారం లేదని ఎవరు భయపడాల్సిన పనిలేదన్నారు. ఈ తనిఖీల్లో టాస్క్ఫోర్స్ ఎస్సై మధుసూదన్, శ్రీరాంపూర్ పోలీసు సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.