Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెడ్పీటీసీ చైర్మెన్ రాథోడ్ జనార్ధన్
నవతెలంగాణ-ఆదిలాబాద్టౌన్
విద్యారంగ అభివృద్ధి, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో ఎస్టీయూ ప్రత్యేక చొరవ అభినందనీయమని జిల్లా పరిషత్ చైర్మెన్ జనార్ధన్ రాథోడ్ అన్నారు. ఆదివారం ఎస్టీయూ భవన్లో ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు జాదవ్ అశోక్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన సంఘ వజ్రోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కొరకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. అదేవిధంగా పాఠశాలల మౌలిక వసతుల అభివృద్ధి కొరకు మన ఊరు మన బడి పథకం సత్ఫలితాలను ఇస్తుందని అన్నారు. సంఘ అభివృద్ధికి కృషి చేసిన రిటైర్డ్ సంఘ సభ్యులను సన్మానించడం గొప్ప విషయమని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ లాంటి గొప్ప మేధావులు పని చేసిన సంఘం యొక్క వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర నాయకులు సదానంద గౌడ్ మాట్లాడుతూ సీపీఎస్ రద్దు కొరకు సీఎం ప్రత్యేక చొరవ చూపాలని 317 జీఓతో నష్టపోయిన ఉపాధ్యాయులకు పరిష్కారం చూపాలని అన్నారు. బదిలీలు, పదోన్నతులు, షెడ్యూల్ వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ సందర్భంగా సంఘం సీనియర్ నాయకులను జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలను శాలువా మెమొంటోలతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా జిల్లా ప్రధాన కార్యదర్శి మూగ శ్రీనివాస్ వ్యవహరించారు. ఉమ్మడి జిల్లా పూర్వాధ్యక్షులు ముకుందరావు, చిలక విలాస్, రాష్ట్ర నాయకులు పుప్పాల నరేందర్, దిలేష్ చౌహాన్, బెజ్జంకి రవీంద్ర, సత్యనారాయణ, రాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు మండల బాధ్యులు ప్రాథమిక సభ్యులు పాల్గొన్నారు.