Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన సంక్షేమ శాఖ డీడీ దిలీప్
నవతెలంగాణ-ఉట్నూర్
గిరిజన విద్యార్థుల్లో సహజ సిద్ధంగా క్రీడా ప్రతిభ ఉంటుందని శిక్షణతో వీరి క్రీడా ప్రతిభకు మరింత పదును పెట్టాలని గిరిజన సంక్షేమ శాఖ డీడీ దిలీప్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని కుమురం భీమ్ ప్రాంగణంలో గల క్రీడా మైదానంలో జరిగిన గిరిజన ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు జోనల్ స్థాయి క్రీడ శిబిరాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి గిరి క్రీడోత్సవాల్లో పాల్గొనే క్రీడాకారుల కోసం ప్రత్యేకంగా దసరా సెలవుల్లో శిబిరాలను ఐటీడీఏ తరఫున ఏర్పాటు చేశామన్నారు. ఆటకంటే ఏది గొప్ప కాదని వ్యక్తి ప్రతిభ కోసం జట్టును నష్టపరుచుకోవద్దని తెలిపారు. క్రమశిక్షణతో కోచ్లు నేర్పించే అంశాలపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఆటగాళ్లందరూ తాము ఆడే ఆటపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. పండుగకు ఇంటి వైపు విద్యార్థుల ద్యాస మల్లకుండ శిక్షణలో క్రీడాకారులకు మంచి భోజనం అందించాలని తెలిపారు. ఆటలలో మరింత మెలుకువల కోసం సాంకేతికంగా ప్రొజెక్టర్ల ద్వారా వీక్షించే ఏర్పాటు చేయాలన్నారు. క్రమం తప్పకుండా శిక్షణ శిబిరాన్ని సందర్శిస్తానన్నారు. ఇటీవల నిర్మల్లో జరిగిన జిల్లా స్థాయి ఖోఖో పోటీల్లో ప్రతిభ కనబరిచి, రాష్ట్రస్థాయి జూనియర్ ఖోఖో పోటీల్లో పాల్గొనేందుకు ఎంపికైన క్రీడా పాఠశాలల విద్యార్థులు నవీన్, నిఖిల్, నరేష్, శివకుమార్లను అభినందించారు. అంతకుముందు పీడీలు, పీఈటీలతో సమావేశం నిర్వహించి శిబిరం గురుంచి పలు సూచనలు చేశారు. ఆయన వెంట జిల్లా గిరిజన క్రీడల అధికారి పార్థసారథి, ఉట్నూర్ ఏటీడీఓ క్రాంతి, పీడీలు హేమంత్ కుమార్, శ్రీనివాస్, మధుసూదన్, రవీందర్, జలపతి, కోచ్లు లక్ష్మీరాం, గజానంద్, శివకుమార్, శేఖర్, మనోజ్, విశ్వనాథ్, క్రీడాకారులు పాల్గొన్నారు.