Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మందమర్రి రూరల్
కాంటాక్ట్ కార్మిక నాయకులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని కాంట్రాక్ట్ కార్మిక జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం మందమర్రి ఏరియా జీఎం కార్యలయం వద్ద కాంట్రాక్ట్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా కాంట్రాక్ట్ కార్మిక జేఏసీ నాయకులు మాట్లాడురు. శాంతియుత చేపట్టిన పోరాటాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం నాయకులపై అక్రమకేసులు బనాయించి భయబ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. జేఏసీ నాయకులకు మద్దతుగా నిలిచిన రాజకీయ పార్టీల నాయకులపై అక్రమ కేసులు పెట్టిన ఇబ్బందులు పెట్టేందుకు కట్రపన్నారని ఆరోపించారు. సింగరేణిలో మొత్తం 11 డివిజన్లలో కాంట్రాక్ట్ కార్మికులు శాంతియుతంగా సమ్మె చేస్తుంటే ఒక్క మందమర్రి డివిజన్లో జేఏసీ నాయకులుపైన, మద్దతు తెలిపిన వివిధ పార్టీల నాయకులపై కేసులు పెట్టడం ఏమిటని స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు దూలం శ్రీనివాస్, ఐఎఫ్టీయూ ఎండీ.జాఫర్, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సంకే రవి, టీడీపీ పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షులు సంజరు కుమార్, ఏఐటీయూసీ సలెంద్ర సత్యనారాయణ, ఏరియా నాయకులు పార్వతి రాజిరెడ్డి, వెల్ది సుదర్శన్ పాల్గొన్నారు.