Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు
- మంచిర్యాల మున్సిపల్లో చీరల పంపిణీ
నవతెలంగాణ-మంచిర్యాల
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలోని ప్రతి ఇంటికి పెద్ద కొడుకుగా అండగా ఉంటున్నారని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు కొనియాడారు. ఆదివారం మంచిర్యాల మున్సిపల్ పరిధిలోని వివిధ వార్డుల్లో తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న బతుకమ్మ చీరలను ఆయన పంపిణీ పంపిణీ చేశారు. మహిళలకు చీరలు అందజేసిన సందర్భంగా ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రజల సంక్షేమ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. వృద్ధులు, మహిళలు, వికలాంగులు, రైతులు, కార్మికులతో పాటు అన్ని వర్గాలకు ప్రభుత్వ పథకాలు ఏదో ఒక రూపంలో అందుతుండటం ప్రభుత్వ సుపరిపాలనకు నిదర్శనమని అన్నారు. రాజకీయాలకు సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలవుతుండడం విశేషం అని వివరించారు. లబ్ధిదారులు ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్, కౌన్సిలర్లు నల్ల శంకర్, బొలిశెట్టి సునీత కిషన్, మాదంశెట్టి సత్యనారాయణ, గాదే సత్యం, సురేష్ బల్దువ, మహేశ్వరి, సత్తమ్మ, తహసీల్దార్ రాజేశ్వరరావు, కమిషనర్ బాలకష్ణ, డీసీసీబీ డైరెక్టర్ ఎర్రం తిరుపతి, మాజీ కౌన్సిలర్లు పల్లె రాజన్న, కోదాది కమల, తొమ్మిదవ వార్డు అధ్యక్షులు కార్ల తిరుపతి, రమేష్ యాదవ్, నార్ల వంశీ పాల్గొన్నారు.
వాంకిడి : మండలంలోని కమాన గ్రామ పంచాయతీలో ఆదివారం మహిళలకు వాంకిడి జడ్పీటీసీ అజరుకుమార్ బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బతుకమ్మ పండుగకు కానుకగా ఆడబిడ్డలకు ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ చీరలు అందించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో తమేళ సర్పంచ్ మారుతి, ఏపీఎం మహేష్ పాల్గొన్నారు.
కాసిపేట : మండలంలోని మల్కేపల్లి గ్రామ పంచాయతీలో ఆదివారం మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఎంపీపీ రొడ్డ లక్ష్మీ, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు బొల్లు రమణారెడ్డి, సర్పంచ్ కుడ్మేత లక్ష్మీ చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఓసీసీ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగు తిరుపతిరెడ్డి, సహకార వైస్ చైర్మన్ శంకర్ గౌడ్, ఉప సర్పంచ్ ఆడె జనార్ధన్, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు సల్లూరి ప్రభాకర్, సుధాకర్ రెడ్డి, మాసు సుధాకర్ పాల్గొన్నారు. అదేవిందంగా మండలంలోని సోమగూడెం(కే) గ్రామ పంచాయతీలో ఆదివారం మహిళలకు జడ్పీటీసీ పల్లె చంద్రయ్య, సర్పంచ్ సపాట్ శంకర్, ఎంపీటీసీ కొండబత్తుల రాంచందర్ చేతుల మీదుగా బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో లంబాడితాండ(డీ) సర్పంచ్ అజ్మీర తిరుపతి, నాయకులు చింతల భీమయ్య, బానోత్ వినోద్, ఉప సర్పంచ్ తిరుమల్ పాల్గొన్నారు.