Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంచిర్యాల
ఫార్మసిస్టులకు తమ విధుల్లో ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని మంచిర్యాల జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుబ్బరాయుడు పేర్కొన్నారు. ఆదివారం ప్రపంచ ఫార్మాసిస్టు దినోత్సవ సందర్భంగా స్థానిక లయన్స్ క్లబ్ భవన్లో ఏర్పాటుచేసిన జిల్లా ఫార్మసిస్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో పలువురు ఫార్మసిస్టులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య రంగంలో వైద్యుల పాత్రతో పాటు ఫార్మసిస్టుల పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు. ప్రభుత్వపరంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుండి జిల్లా స్థాయి ఆరోగ్య కేంద్రాల వరకు ఫార్మసిస్టుల సేవలు ఎనలేనివని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఫార్మసిస్టు అసోసియేషన్ అధ్యక్షులు అఖిల్, ప్రధాన కార్యదర్శి ఎంఏ భారీ, జిల్లా ఆసుపత్రి ఫార్మసిస్టు సూపర్వైజర్్ శ్రీవాణి, కాలేశ్వరం జోన్ ఫార్మసిస్టు అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ పి.శంకర్, కోశాధికారి ఏం చంద్రయ్య, ఆర్.శ్రీనివాస్ తోపాటు జిల్లా రిజిస్టర్ ఫార్మసిస్ట్ సంఘం నాయకులు నాగేందర్, చొక్కారపు శ్రీనివాస్, చంద్రశేఖర్ జిల్లాకు చెందిన పలువురు ఫార్మసిస్టులు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్ : ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవాన్ని జిల్లా కేంద్రంలోని జిల్లా వైద్య అధికారి కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి ప్రభాకర్ రెడ్డి ఫార్మసిస్ట్ సంఘం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, ఫార్మసిస్టులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఫార్మసీస్టులు నాణ్యమైన సేవలు అందిస్తున్నారని కొనియాడారు. కరోనా సమయంలో అత్యంత వేగంగా సేవలందించారని గుర్తు చేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఫార్మసీస్టులు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారన్నారు. ఈ సేవలు ఇలాగే కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫార్మసిస్టు సంఘం జిల్లా అధ్యక్షులు ఖలీల్ హుస్సేన్, కార్యదర్శి వెంకటేష్, కోశాధికారి రవీంద్ర ప్రసాద్, సంయుక్త కార్యదర్శి విజయలక్ష్మి, రామచంద్ర రెడ్డి, సభ్యులు తిరుపతి, సందీప్, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.