Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముధోల్
తెలంగాణ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఐకేపీ ఆధ్వర్యంలో మహిళ సంఘం సభ్యులకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కాని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు అవుతున్నాయని అన్నారు. మండల స్వయం సహాయక సంఘం ఆర్థిక అభివృద్ధి సాధించడం అభినందనీయం అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆయేషా అఫ్రోజ్ ఖాన్, మండల రైతుబంధు అధ్యక్షులు రామ్‌రెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మెన్ సురేందర్‌రెడ్డి, మండల కోఆప్షన్ సభ్యులు సయ్యద్ ఖాలిద్, డీపీఎం సాయిప్రసాద్, ఎపీఎం అశోక్, సర్పంచ్ రాజేందర్, నాయకులు రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, రోల్ల రమేష్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
నార్నూర్:మండలంలోని మరప్పగూడ గ్రామ పంచాయతీలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా బతుకమ్మ కానుకగా అందిస్తున్న బతుకమ్మ చీరలను ఆదివారం ఎంపీటీసీ కళావతి ఉత్తం, సర్పంచ్ యాదవ్‌రావు ఆడపడుచులకు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పేద ఇంటి ఆడపడుచులకు దసరా పండుగ, బతుకమ్మ పండుగకు ప్రత్యేకంగా చీరలు పంపిణీ చేస్తుందన్నారు. వీటితో పాటు సంక్షేమ పథకాలతో పాటు గ్రామాభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. అంతర్జాతీయ కూతుర్ల దినోత్సవం సందర్భంగా అమ్మాయిలు మొక్కలు నాటారు. కార్యక్రమంలో నాయకులు రాహుల్, ఉపసర్పంచ్ హలిమాబీ, గ్రామస్తులు అప్జల్, సంతోష్, అరవింద్ అంగన్వాడిలు పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి:తెలంగాణ ప్రభుత్వం దసరా కానుకగా ఆడపడుచులకు బతుకమ్మ చీరలు అందిస్తోందని ఎమ్మెల్యే అజ్మీరా రేఖా శ్యామ్ నాయక్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిదిగా హజరై పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అన్ని వర్గాల అభివృద్ధికి ప్రాధాన్యతను ఇస్తోందని అన్నారు. రూ.350 కోట్ల వ్యయంతో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు బతుకమ్మ చీరలను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ పి.శోభ, జెడ్పీటీసీ పుష్పలత, మార్కెట్ కమిటీ చైర్మెన్ శ్రీరామ్ నాయక్, జిల్లా కోఆప్షన్ సభ్యులు అంజాద్, పీఏసీఎస్ చైర్మెన్ డోంగ్రె మారుతీ, నాయకులు సోఫియాన్ పాల్గొన్నారు.
రామకృష్ణాపూర్్:తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీలో భాగంగా ఆదివారం క్యాతనపల్లి మున్సిపాలిటీలోని 5, 9వ వార్డు కౌన్సిలర్లు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు జీలకర మహేష్, పారుపెల్లి తిరుపతి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఆడపడుచులకు చీరలను అందచేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. బతుకమ్మ పండుగను ఆనందోత్సవాలతో నిర్వహించుకోవాలని ప్రతి సంవత్సరం సీఎం కేసీఆర్ ప్రతి పేదింటి ఆడపడుచుకు ప్రభుత్వ కానుకగా బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, భీమ రవి, లింగయ్య, ఈశ్వరయ్య, చంద్రగిరి రమేష్, ఆర్పీ శైలజ, మహిళలు పాల్గొన్నారు.
ఇచ్చోడ:తెలంగాణ రాష్ట్ర సాంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక వేల సంవత్సరలుగా కొనసాగుతున్న పండుగే బతుకమ్మ అని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని జెడ్పీఎస్ఎస్ పాఠశాల ఆవరణంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళ సంక్షేమ కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సునీత, మండల కన్వీనర్ ఏనుగు కృష్ణ రెడ్డి, మాజీ కన్వీనర్ మెరాజ్, సీనియర్ నాయకులు సుభాష్ పటేల్, రైతుబంధు అధ్యక్షులు ముస్తఫా, సుద్దవార్ వెంకటేష్, అబ్దుల్ రషీద్, ప్రకాష్, ఆర్గుల గణేష్, లతీఫ్, ముసుకు గంగారెడ్డి, అజిమ్ సుల్తాన్, రామేశ్వర్, సురేందర్ రెడ్డి, సుభాష్ రెడ్డి, భూతి రాజు, మహేందర్‌రెడ్డి, బలగం రవి, గొనె లక్ష్మీ, కడమంచి భీముడు, గంగయ్య, గాయకాంబ్లీ గణేష్ పాల్గొన్నారు.
ఉట్నూర్:దసరా ఉత్సవాలకు తెలంగాణలోని ప్రతి ఆడబిడ్డలకు ప్రభుత్వం బతుకమ్మ చీర అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే అజ్మీరా రేఖా శ్యాం నాయక్ అన్నారు. ఆదివారం ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల జీవనంలో భాగమైపోయిన బతుకమ్మ కండంతరాలకు విస్తరించి తెలంగాణ సాంస్కృతిని విశ్వవ్యాప్తంగా నిర్వహించే విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందన్నారు. ఏ ప్రభుత్వం చేయని కార్యక్రమాలు కేసీఆర్ ప్రభుత్వం చేస్తోందన్నారు. గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పంద్రా జైవంత్ రావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.