Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్
బడి పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు ఆర్టీసీ బస్సులలో ప్రయాణిస్తే ఆదిలాబాద్ డిపో లాభాల బాట పడుతుందని డిపో మేనేజర్ కల్పన అన్నారు. సొంత జిల్లాలో డిపో మేనేజర్‌గా బాద్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆర్టీసీ డిపోలో తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆద్వర్యంలో ఆదివారం సన్మానించారు. ఈ సందర్భంగా డీఎం మాట్లాడుతూ బడి పిల్లల ఉన్నత చదువులకు ఆర్టీసీ సౌకర్యంగా ఉందన్నారు. పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు 30 మంది ప్రయాణీకులు ఉంటే కాలనీకే బస్సు పంపిస్తామన్నారు. ప్రభుత్వ సంస్థలు, పాఠశాలలు ఉన్నతాధికారుల అనుమతి ఉత్తరంతో వస్తే పది శాతం రాయితీ ఇస్తామని పేర్కొన్నారు. సురక్షితమైన ప్రయాణాలకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలన్నారు. ఈ సందర్బంగా తనకు చదువు చెప్పిన గురువులను గుర్తు చేసుకున్నారు. తనకు చదువు చెప్పిన గురువు కిరణ్ బాల తన సన్మాన కార్యక్రమానికి రావడంతో భావోద్వేగానికి లోనయ్యారు. కార్యక్రమంలో టీయూటీఎఫ్ జిల్లా అద్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీకాంత్, జలంధర్‌రెడ్డి, అంకోలి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరెందర్ రెడ్డి, సహాయక మేనేజర్ జనాబాయి, స్టేషన్ మేనేజర్ జేఎన్ కుమారి, స్టేషన్ కంట్రోలర్ జేఆర్ చందర్, తన్వీర్, డీసీ వందన ఉపాధ్యాయులు పాల్గొన్నారు.