Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆసిఫాబాద్
కేరళ రాష్ట్రంలోని కోజికోడులో జరుగుతున్న సీపీఐ ఎంఎల్ రెడ్ స్టార్ పార్టీ 12వ జాతీయ మహాసభల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన ర్యాలీ బహిరంగ సభలో జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని వాటిని ఎండగట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఆగస్టులో మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించే రాష్ట్ర మహాసభలు విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్సి గొగర్ల తిరుపతి, నాయకులు తిరుపతి, మనోహర్, మీన, సావిత్రి పాల్గొన్నారు.