Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జైనథ్
ఇటీవల ఎమ్మెల్యే జోగురామన్న మాతృమూర్తి మరణించింది. దీంతో ఎమ్మెల్యే జోగు రామన్నను పరామర్శించేందుకు మంత్రి కేటీఆర్ సోమవారం దీపాయిగూడకు వచ్చారు. ముందుగా జైనథ్ మండల కేంద్రంలో మంత్రి పర్యటన నిమిత్తం ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న మంత్రికి పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజా ప్రతినిధులు స్వాగతం పలికారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్, ఎస్పీ ఉదరు కుమార్ రెడ్డిలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. అనంతరం రాష్ట్ర మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిలు జైనథ్కు చేరుకున్నారు. వారికి పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. ఎమ్మెల్యే స్వగ్రామమైన దీపాయిగూడకు చేరుకొని ఎమ్మెల్యే జోగురామన్నను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. జోగు భోజమ్మ చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో ముచ్చటించి, వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మనవండ్లతో సరదాగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు దండె విఠల్, శంబీపూర్ రాజు, మున్సిపల్ చైర్మెన్ జోగుప్రేమేందర్ పాల్గొన్నారు.