Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆదిలాబాద్ అర్బన్
జిల్లా కేంద్రానికి వచ్చిన మంత్రి కేటీఆర్కు ఉద్యోగ, ఉపాధ్యాయుల నిరసన వ్యక్తం చేశారు. సోమవారం ఎమ్మెల్యే జోగురామన్నను పరామర్శించడానికి జిల్లా కేంద్రానికి వచ్చిన మంత్రి కేటీఆర్ వచ్చారు. జీఓ నెంబర్ 317 బాధిత ఉద్యోగ, ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. కేటీఅర్కు వినతిపత్రం అందజేయడానికి వచ్చిన బాధిత ఉపాధ్యాయులను ముందస్తు అపాయింట్మెంట్ లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉపాధ్యాయులు ప్లకార్డులతో నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. చివరి నిమిషంలో మంత్రిని కలిసి వినతిపత్రం అందించి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా జీఓ 317 గురించి బాధితులు నిరసనలు వ్యక్తం చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికత పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణలో తమ స్థానికతను ప్రశ్నార్థకం చేసిన జీఓ నెంబర్ 317ను పునః సమీక్షించాలని వారు కోరారు. ఈ జీఓ ద్వారా స్థానిక ఉద్యోగ, ఉపాధ్యాయులను ఇతర జిల్లాలకి శాశ్వత బదిలీ చేయడం సమంజసం కాదని దానివల్ల కన్నవారికి, ఉన్న ఊరుకు దూరమై మనోవేదనకు గురవుతున్నామని వాపోయారు. ఈ జీఓను వెంటనే పునః సమీక్షించాలని లేనిపక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బాధిత ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.