Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆదిలాబాద్ అర్బన్
తెలంగాణ వీరవనిత, పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఘన నివాళులర్పించారు. సోమవారం జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయా శాఖల మంత్రులు రిమ్స్ ఎదుట ఉన్న ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముందుగా తెలంగాణ రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కే.తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఆమె చేసిన పోరాటాలను గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐలమ్మ సాధారణ మహిళగా ఉండి నాటి నిజాం ఆకృత్యాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన గొప్ప యోధురాలు అన్నారు. తెలంగాణ బానిస సంకెళ్ల విముక్తి కోసం ఆమె చేసిన పోరాటాలు మరువలేనిగాని కీర్తి గడించారు. నాటి ఆమె పోరాటాల ఫలితమే నేటి తెలంగాణ రాష్ట్ర విముక్తి పోరాటాలకు నాంది అని పేర్కొన్నారు. పోరాటాలకు నిలయమైన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ బాటను పరిచయం చేసిన యోధురాలు చాకలి ఐలమ్మ అని వివరించారు. ఈ కార్యక్రమంలో అటవీ పర్యావరణ న్యాయశాఖ మాత్యులు ఇంద్రకరణ్ రెడ్డి, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మున్సిపల్ చైర్మెన్ ప్రేమేందర్, వైస్ చైర్మెన్ జహీర్ రంజాని, జిల్లా నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ అర్బన్:జిల్లా కేంద్రంలో టీఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సోమవారం ఆమె జయంతిని పురస్కరించుకొని రిమ్స్ ఎదుట ఉన్న ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు మల్యాల మనోజ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన వీర వనిత చాకలి ఐలమ్మ అని అన్నారు. ఆత్మగౌరవానికి, మహిళా చైతన్యానికి ప్రతీక చాకలి ఐలమ్మ అని ఆమె త్యాగాలు రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో అలుపెరగని పోరాటం చేసిన ఆమెను తెలంగాణ తల్లిగా గౌరవించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో టీఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి నక్క రాందాస్, జిల్లా కోశాధికారి లింగంపల్లి ప్రసన్న, జిల్లా కార్యదర్శి గజ్జల అశోక్, కత్తి గంగాధర్, కాంపెళ్లి అనిల్ కుమార్, లింగంపల్లి రమేష్, నరేష్ పాల్గొన్నారు.
మామడ:మహిళా చైతన్యానికి, ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మ అని మండల రజక సంఘం అధ్యక్షులు ఏటి రాజేశ్వర్ అన్నారు. సోమవారం మండలంలోని కొరటికల్ గ్రామపంచాయతీ ఎదుట ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన హాజరై ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం మనందరికి గర్వకారణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బోజవ్వ, ఎంపీటీసీ అందె సౌజన్య, నిర్మల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నల్ల లింగారెడ్డి, గ్రామస్తులు, రజక సంఘ సభ్యులు పాల్గొన్నారు.
నిర్మల్:మహిళా చైతన్యానికి, ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఐలమ్మ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం మనందరికి గర్వకారణమన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఐలమ్మ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు కోసం ఇటీవలే భూమి పూజ చేశామన్నారు. నిర్మాణ పనులు త్వరగా పూర్తీ చేసుకుని, విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ గండ్రత్ ఈశ్వర్, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
తలమడుగు:మండల కేంద్రంతో పాటు రుయ్యాడి గ్రామంలో చాకలి ఐలమ్మ 127 వ జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. రుయ్యాడి గ్రామంలో గల చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రుయ్యాడి గ్రామ సర్పంచ్ పోతారెడ్డి, పోచ్చన్న, కిష్టన్న, దేవన్న, అశోక్, నరేష్, తలమడుగు గ్రామస్తులు, లింగన్న, భూమన్న, స్వామి, దత్తు, లింగన్న, శివన్న మహిళలు పాల్గొన్నారు.
బేల:మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ 127వ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించుకున్నారు. చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చాకలి ఐలమ్మ పోరాట పటిమను వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు కళ్లెం ప్రమోద్‌రెడ్డి, సతీష్ పవార్, ఒళ్లఫ్వార్ దేవన్న, బేల సర్పంచ్ ఇంద్రశేఖర్, రజక సంఘం మండల అధ్యక్షులు ప్రకాష్, జనరల్ సెక్రటరీ విఠల్, సంఘం సభ్యులు రమేష్, గులాబ్, అరవింద్, దీపక్, నార్లావార్ సంతోష్ పాల్గొన్నారు.