Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-లక్ష్మణచాంద
బహుజన రాజ్య స్థాపనే డీఎప్పీ లక్ష్యమని డాక్టర్ విశారదన్ మహారాజ్ అన్నారు. సోమవారం మండలంలోని పీఛర గ్రామం నుండి లక్ష్మణచాంద మీదుగా పొట్టపల్లి (కె) వరకు డీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహారాజ్ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. పదివేల కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర లక్ష్యంగా సెప్టెంబర్ 15 నాటికి ఆరు నెలలు గడిచి, 3,500 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా లక్ష్మణచాంద దళిత్ శక్తి ప్రోగ్రాం అధ్వర్యంలో సంఘీభావ యాత్ర నిర్వహించారు. ఇందులో భాగంగా పీఛరలోని అంబేద్కర్ విగ్రహనికి పూలమాలవేసి నివాళులర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా విశారదన్ మహారాజ్ మాట్లాడుతూ బహుజన రాజ్యం లక్ష్యంగా పని చేయాలి అని అన్నారు. ఈ యాత్రలో భాగంగా యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దళిత శక్తి ప్రోగ్రాం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ మండల నాయకులు కొమటి రమేష్ మహారాజ్, అరవింద్ మహారాజ్, సంతోష్ మహారాజ్, ముత్యం మహారాజ్, రవీందర్ మహారాజ్, భుమేష్ మహారాజ్ పాల్గొన్నారు.