Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ-నిర్మల్
జిల్లాలోని అర్హులైన వికలాంగులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని, వికలాంగులు ఎదుర్కొంటున్నా సమస్యలు పరిష్కరించాలని స్పందన దివ్యాంగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు ఇసాక్ ఆలీ అన్నారు. సోమవారం సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా మాట్లాడారు. 2016 వికలాంగుల హక్కుల చట్టం ప్రకారం ప్రతి ప్రభుత్వ సంక్షేమ పథకాలలో వికలాంగులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించబడిందన్నారు. వెంటనే అమలు చేయాలన్నారు. అర్హులైన వికలాంగులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ద్విచక్ర వాహనాలు ఇవ్వాలన్నారు. ప్రతి నెల 5వ తేదిలోపు పింఛన్ వచ్చేలా చూడాలన్నారు. ఖాళీగా ఉన్న బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయాలన్నారు. దళితబంధు లాగే దివ్యంగాబంధు ఇవ్వాలన్నారు. కార్యాలయంలో సంఘం నాయకులు నిషిత, శివకుమార్, భగవాన్, ఖైసర్, సంజీవ్, మీనాక్షి, శేఖర్, సుజాత, వికలాంగులు పాల్గొన్నారు.