Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కడెం
మండలంలోని అంబారిపేట్ గ్రామంలో సోమవారం నూతనంగా మంజూరైనా ఆసరా పింఛన్ కార్డులను అంబారిపేట్ సర్పంచ్ కొప్పుల లక్ష్మి లచ్చన్న ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్బంగా సర్పంచ్ లక్ష్మి లచ్చన్న మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం వృద్దులకు, వికలాంగుల, వితంతువులకు వారికి చేదోడుగా ఆసరాగా పింఛన్‌ను తెలంగాణ ప్రభుత్వం అందజేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కట్ల సింధూజ సాగర్, ఉపసర్పంచ్ ఎల్లయ్య, వార్డు సభ్యులు చంటి, గంగన్న, హరీష్, వనిత, గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షుడు రవి, గ్రామ సభ్యులు పాక అంజన్న, డీలర్ ప్రసాద్, మిల్కురి సతన్న, బచ్చు మల్లేశం, సుధాకర్ అంబారిపేట్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.