Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాసిపేట
మండలంలోని దేవాపూర్‌లో విజయదశమిన నిర్వహించే రావణ దహనం కార్యక్రమాన్ని నిర్వహించవద్దని తుడుందెబ్బ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం తుడుందెబ్బ ఆధ్వర్యంలో తహసీల్దార్ దిలీప్ కుమార్‌కు వినతిపత్రం అందించారు. ఆదివాసీ ఆరాధ్య దైవమైన రావణున్ని దసరా రోజు రహనం చేయడం ఆదివాసీలను కించపరచడమేనని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రావణ దహన కార్యక్రమం చేపట్టవద్దని కోరారు. కార్యక్రమంలో తుడుందెబ్బ నాయకులు మడావి వెంకటేశ్, ఆత్రం సంజీవ్, పెంద్రం ప్రభాకర్, కుర్సింగ తిరుపతి, చిక్రం రాందాస్, సెడ్మకి రాధ, పెంద్రం హన్మంతు, వెడ్మ కిషన్ పాల్గొన్నారు.