Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
నవతెలంగాణ-తాండూర్
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా విద్యాబోధన జరుగుతుందని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. ఆయన గురువారం మండలంలోని తాండూర్, రేచిని హై స్కూల్స్లో మన ఊరు-మన బడి కార్యక్రమంలో మంజూరైన నిధులతో అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులను విడుదల చేసిందన్నారు. పాఠశాలలో డైనింగ్ హాల్, మరుగుదొడ్లు, వంట గదులు వంటి మౌలిక వసతులకు వినియోగించాలని సూచించారు. మధ్యతరగతి ప్రజల్లో ప్రభుత్వ పాఠశాలల పట్ల చులకన భావం ఉందని ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఆయన వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగుల స్థిరపడ్డారని ఆయన తెలిపారు. స్థానిక నాయకులు పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులు పనుల నాణ్యతలను పరిశీలించి పాఠశాలల్లో మంచి సౌకర్యాలను ఏర్పరచుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో బోధన సిబ్బంది పిల్లలకు నాణ్యమైన విద్యాబోధన చేసి ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఫలితాలు రాబట్టాలని కోరారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో విద్యారంగ అభివృద్ధికి అనేక నిధులను సమకూరుస్తున్నటు తెలిపారు. అనంతరం కల్యాణలక్ష్మి షాదిముభారక్ చెక్కులను, బతుకమ్మ చీరలను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రణరు, డ్పీటీసీ బానయ్య, ఎంపీటీసీలు సిరంగి శంకర్, రజిత సర్పంచ్లు దుర్గభారు, నవీన్, రమేష్, కిస్టఫర్, సింగిల్ విండో ఛైర్మన్ దత్తుముర్తి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రంజిత్, తహసీల్దార్ కవిత, ఎంఈఓ ప్రభాకర్ పాల్గొన్నారు.