Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆసిఫాబాద్ ఎస్పీ సురేష్ కుమార్
నవతెలంగాణ-ఆసిఫాబాద్
ఆదివాసీ ప్రాంతాలనే ఎంచుకొని మావోలు తమ అభివద్ధికి అడ్డుగా మార్చుకుంటున్నారని, వారికి ఎటువంటి సహాయ సహకారాలు చేయకూడదని ఆసిఫాబాద్ ఎస్పీ సురేష్ కుమార్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని టాటియా గార్డెన్లో జిల్లాలోని ఆదివాసీ పటేళ్లు, గోండ్వాన రారు సెంటర్ సర్మడిలు సభ్యులతో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మావోయిస్టులు అభివృద్ధికి అడ్డుగా నిలుస్తున్నారని అన్నారు. ఈ మధ్యకాలంలో ఆదివాసి మారుమూల గ్రామాల్లో మావోయిస్టుల కదలికలు మొదలయ్యాయని, వారి ఉనికిని చాటేందుకు ప్రవేశించారని వార్తలు వస్తున్నాయని గ్రామాల్లో అభివృద్ధి నిరోధకులకు రానివ్వదన్నారు. వారు ప్రజలకు చేసింది ఏమీ లేదని వచ్చి రోడ్లు వంతెనలు అభివృద్ధి పనులను చేయించవద్దని చెప్తారని అన్నారు. మన దగ్గరకు వచ్చి మన అన్నం తిని ఖర్చు చేయిస్తారని అలాంటి వారికి ఎవరు సహకరించవద్దని అన్నారు. ఎవరైనా కొత్తవారు, మావోయిస్టులు వస్తే సమాచారం ఇవ్వాలని సమాచారం ఇచ్చిన వారికి తమవంతుగా పారితోషికం ఇస్తామని అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ కొనసాగుతున్న నేపథ్యంలో ఆదివాసులకు పోలీసులు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయాలు గౌరవించడమే కాకుండా వారి అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. పోలీసుల ఆధ్వర్యంలో గిరిజన ప్రాంతాల్లో ఎన్నో సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఆదివాసుల అభివద్ధి జరగాలని అది విద్యతోనే సాధ్యమని గుర్తించి పోలీసుల ఆధ్వర్యంలో నిరుద్యోగులకు కానిస్టేబుల్ ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు, మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. వాంకిడి మండలం టొక్కిగూడలో జరిగిన సంఘటనలో విద్యుత్ షాక్తో తీవ్ర గాయాలైన రాజక్కకు వాంకిడి పోలీసుల ఆధ్వర్యంలో రూ.1,40,000 చెక్కు బాధితురాలకు అందజేశారు. అనంతరం ఆదివాసి నాయకులను సన్మానించారు. కార్యక్రమంలో ఆసిఫాబాద్ డీఎస్పీ శ్రీనివాస్, ఆసిఫాబాద్ సీఐ రాణా ప్రతాప్, వాంకిడి సీఐ శ్రీనివాస్, రెబ్బెన సీఐ నరేందర్, ఎస్సైలు దీకొండ రమేశ్, భూమేష్, రమేశ్, గంగన్న, కల్యాణి పాల్గొన్నారు.