Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జన్నారం
సమాచార హక్కు పరిరక్షణ సమితి జన్నారం మండల అధ్యక్షునిగా కొండపల్లి ప్రశాంత్ నియమితులయ్యారు. ఆ సమితి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ఆదేశాలమేరకు రాష్ట్ర కోఆర్డినేటర్ ఉత్తరయ్య ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు గురువారం సమితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు గోలి శ్రీనివాస్, మంచిర్యాల జిల్లా కన్వీనర్ వైద్య శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు మాదాస్తు వెంకటేశ్వర్లు చేతులమీదుగా ప్రశాంత్ నియామక పత్రాన్ని అందుకున్నారు. సంస్థ నియమాలకు లోబడి పనిచేస్తూ ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని బయటకు తీసీ సమాచార హక్కు చట్టం గురించి పౌరులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తానన్నారు. అదే విధంగా నాపై నమ్మకం ఉంచి బాధ్యత అప్పగించినందుకు అవినీతి రహిత సమాజ నిర్మాణంలో పాలుపంచుకునే విధంగా నా కర్తవ్యాన్ని నిర్వహిస్తానని తెలిపారు. కార్యక్రమంలో సమాచార హక్కు పరిరక్షణ సమితి లక్షెట్టిపేట్ మండల అధ్యక్షులు కొండపర్తి ప్రసన్న కుమార్, నస్పూర్ మండల అధ్యక్షులు రామిళ్ల రాజేష్, మందమర్రి మండల అధ్యక్షులు కుమ్మరి రమేష్, జిల్లా నాయకులు రేవెళ్లి రాజలింగు, గాండ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.