Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తాంసి
తెలంగాణా రాష్ట్రంలోని ఆడపడుచులను తన తోబుట్టువులుగా ఆదారిస్తూ పెద్దన్నగా కేసీఆర్ వారి ఆత్మగౌరవాన్ని పెంపొందిస్తూ బతుకమ్మ చీరలను అందిస్తున్నారని జెడ్పీటీసీ రాజు అన్నారు. గురువారం మండల కేంద్రంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హజరై గ్రామ సర్పంచ్‌తో కలిసి మహిళలకు బతుకమ్మ పండుగ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలకు కేసీఅర్ పెద్దన్నగా బతుకమ్మ పండుగ సందర్భంగా చీరలను అందించడం గొప్ప విషయమని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఏ కార్యక్రమం తీసుకున్న మొదటగా మహిళలకే పెద్ద పీట వేస్తున్నారని అన్నారు. అనంతరం రామేశ్వర ఆలయంలో ప్రతిష్టించిన దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ ద్వజాస్తంబ నిర్మాణానికి తనవంతు విరాళంగా రూ.5వేలు గ్రామ కమిటీకి అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ స్వప్న రత్న ప్రకాష్, ఎంపీటీసీ నరేష్, కన్వీనర్ అరుణ్, రైతు బంధు కోఆర్డినేటర్ గోవర్దన్ రెడ్డి, నాయకులు కాంత రెడ్డి, గంగారాం, అంగన్వాడీ టీచర్లు ఉన్నారు.