Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
నవతెలంగాణ-నార్నూర్
గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం గాదిగూడ మండలంలోని లోకారి(బి) గ్రామంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి జెడ్పీ చైర్మెన్ జనార్దన్ రాథోడ్, ఎమ్మెల్యే ఆత్రం సక్కులతో కలిసి పంపిణీ చేశారు. మండలంలోని పలు గ్రామాలకు రోడ్లు కల్వర్టులు సరిగా లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గాదిగూడలో సబ్ స్టేషన్ ఏర్పాటు, కమిటీ హాల్స్ నిర్మాణం చేపట్టాలని ఆమె దృష్టికి తీసుకెళ్లగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని కలెక్టర్ తెలిపారు. గత ప్రభుత్వాలు ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోలేదని రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారని జెడ్పీ చైర్మెన్ జనార్దన్ రాథోడ్ అన్నారు. అన్ని మతాల పండుగలను గౌరవిస్తూ కానుకలు అందజేస్తున్నారని తెలిపారు. సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. దళితబంధు తరహాలోని భూమిలేని గిరిజనులకు గిరిజనబంధు అందిస్తామని సీఎం ప్రకటించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పాలకమండలి చైర్మెన్ కనక లక్కేరావు, నాయకులు యూనూస్ అక్బాని, సర్పంచ్ మెస్రం జారుశేఖర్, ఎంపీపీ ఆడ చంద్రకళ రాజు, వైస్ ఎంపీపీ యోగేష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ తోడసం నాగోరావు, డీఆర్డీఓ కిషన్, మత్స్యశాఖ అధికారి విజరు కుమార్, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.