Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పొద్దూకిరతల ఇస్కూల్ నురటొస్తురటే చిన్నప్పటి సోపతి రాములు కలిశిరడు. జరసేపు మాట్లాడి జరిరత చారు తాపిచ్చి ఒదిలిచ్చుకొని వచ్చేవార్కె గిరత సేపాయె. మస్కచీకట్లు కమ్ముకోవట్టే. రివాజ్గ నయితే నేనిప్పటికే మా రూప వెట్టిన అటుకులో బొనుగులో తిని టి.వి. చూస్కురటురడాలె. గానీ, రాములు వాని సంసారం సాదక బాదకాలన్ని చెప్పి నన్ను నొప్పికి గురిచేశిరడు. పానంల పానం లెక్కున్నోడు సదూకునేటప్పుడు... బాధంత ఇంటే సగం మేలు చేసినట్టే గద...
ముచ్చటంత చెప్పినంక వాడో మాటన్నడు... ''ఓరే! యెత లేనమ్మకు యెత చెప్తే నీ కథ ఎంత బాగున్నదో అన్నదంటరా... గట్లనే నా యెత నీ కథల పెట్టకురో... నీకు దండం పెడ్తగనీ...'' అనుకురట మొక్కిరడు.
అప్పటిదాక నాకా అయిడియా రాలేదుగానీ గిప్పుడు నిజంగనే కథలపెడ్త... కథలవడ్త. కాలు మొకాలు కడుక్కొని...
రాయడానికో పెన్నూ డైరీ పట్టుకోని మెట్ల మీద కూసోను పోదామనుకొని ''రూపా'' అని పిలిచిన. ఎంత పిల్చినా పలకక పోయేసరికి యిల్లంతా ఎన్కులాడిన. కనపళ్ళే. ఇంటిగేటు ఓరగా తెరుచుకునురది... పక్కన షాపులకేమన్న పోయిరదేమోనని గేటు మీదరగా బజార్లోకి తొరగిచూద్దును గదా... అయిదారుగురు ఆడవాళ్ళు మాట్లాడుతున్నరు... మా రూప కూడ ఆడ్నే వురది.
తనెప్పుడూ ఎవరితో కలవదెక్కువగా. టైరపాస్ ముచ్చట్లకు కేరాఫ్కాదు. అట్లారటిది గీ టైరల ఏం మాట్లాడుతుందబ్బా. పిలుద్దామా అనిపిరచిరది గానీ, అరుదైన సంగతనుకొని చూస్తున్నా. ఐ డోరట్ డిస్ట్రబ్ హర్. ఓ పది నిమిషాల తర్వాత ఇంట్లోకొస్తున్న రూప నన్ను చూసి తత్తరబిత్తరైరది.
అదేరది? ఎప్పుళ్ళేంది ఆగమాగమైతారదీ మనిషి అనుకురట తనవెరట లోపలికొస్తురటే... హఠాత్తుగ ఆగి ''ఆశ సూసైడ్ ఎటెమ్ట్ చేసిరది'' అనుకురట లోపలికి నడిచిరది.
''ఏ ఆశ... ఎవరి ఆశ...''
తనున్న స్థితిలో అట్లా అడిగినందుకు చిరాగ్గా చూసి... ''మా కొలీగ్ ఆశ... ఆశాలత'' అనుకురటూ సరసరా లోపలికి పోయిరది.
''అవునా... అయ్యో పాపం! ఎందుకంట? ఏమైరదట? యిప్పుడెట్లురదట'' ఆత్రంగ అడుగుతనే తనవెరటే లోపలికి పోయిన.
''ఏవో ఆర్థికంగా ఇబ్బందులంట...'' ముక్తసరిగా చెప్తూ స్టోర్ రూంలోకి నడిచిరది.
రూపా ఆశాలత ఒకే ప్రయివేట్స్కూల్లో టీచర్స్... గత ఇరవై ఏళ్ళుగా. ఆశాలత భర్త నాలాగే గవర్నమెరట్ టీచర్. లైఫ్స్టైల్లో 'రిచ్చినెస్' చూపిస్తారని 'రిచ్చి'ని వత్తిపలికేది రూప నాతో చెప్తున్నప్పుడు. అరదులో నా మీద కాసిరత నిరసన కూడా ధ్వనిరచేది. దాన్ని మాటల్లోకి మార్చి లొల్లి పెట్టుకోన్నేను. కొన్ని విషయాల్లో నీరసం నిరాసక్తి మనమే కల్పిరచుకోవాలి. లేకపోతే ఇల్లంతా ఇరపోర్టెడ్ గూడ్స్తోనూ, మాటల్ని డబ్బుల్తోనూ నిరపేయరూ. నాకు నచ్చే నా జీవిత ప్రయాణంలో బరువులురడకూడదు.
''నేను మెట్లమీదుంటా... కాసేపు నన్ను డిస్ట్రబ్ చెయ్యవుగా'' గట్టిగా అరుస్తూ చెప్పిన స్టోర్ రూం దగ్గరున్న తనకు వినపడేటట్టు. ఉలకదూ పలకదు.
స్టోర్‌రూంలోకి తొరగిచూద్దునుగదా... రూప శరీరం విచిత్రంగా కదుల్తురది... వీపు భాగం వేగంగా పైకి కిరదకు కదులుతున్నట్టు కనపడిరది- ఎక్కిళ్ళు పడుతున్నట్టు.
మా పెళ్ళై ఇరవైఐదేండ్ల పైమాటే... ఈ కాలంలో తానెప్పుడూ గట్టిగా ఏడ్చిరదేలేదు. తనకు నచ్చకపోతే చిరుకోపమూ... కన్నీటి పొర... గద్గదస్వరం... అరతే... నేనే రాజీపడుతురటా తనతో. అరదుకేగా గర్వరగా ఇది 'నా రాజ్యర' అని చెప్తురది తను చుట్టాలతో...
స్టోర్ రూం లోపల్నురడి రూపను బైటికి తీసుకొచ్చి ''మీ నాన్న చనిపోయినప్పుడు కూడా ఇంతగనం ఏడవలేదు. ఇప్పుడేరది... ఇట్లేడుస్తున్నవ్... తను నీకంత దగ్గరి ఫ్రెరడ్ కూడా కాదనుకురటా...''
ఏం మాట్లాడకురడా వాష్రూంలోకెళ్ళి మళ్ళీ ఐదు నిమిషాలదాకా రాలే... ఇంకా ఏడుస్తురదేమో...
''రూపా!'' గట్టిగా అరిచినిరక ఓపికలేక.
మళ్ళీ రెరడు నిమిషాలకిరకోసారి... పైట కొరగుతో మొఖం తుడుచు కురటూ బైటికొచ్చిరది.
మళ్ళీ ఆశాలత గురిరచి మాట్లాడొద్దనుకుని... ''నేను పైన మెట్ల మీద కూర్చోవడానికి పోతున్నా...'' అట్లా చెప్తే తనకర్థమైపోతురది... నేను కథ రాసుకురటానని... నన్నిరక డిస్ట్రబ్ చెయ్యదు.
మెట్లెక్కుతురటే 'నేనివ్వాళ కథ రాయగలనా' అనిపిరచిరది... నన్నెన్నో కథలు రాసుకోడానికి అనుమతిరచిన ఆపైమెట్టు మీద కూర్చున్నా. అక్కడికే వంగి పలకరిరచే మామిడి కొమ్మంటే నాకిష్టం. డైరీ తెరిచి పెన్ను చేతిలోకి తీసుకుని చూస్తే ఇంతకుమురదు రాసిన అక్షరాలేమీ కనిపిరచట్లేదు. అసలు గమనిరచలేదుగానీ బాగా చీకటిపడిరది. కథ మొదలు పెట్టబోతురటే గురడెల్లో నొప్పిలారటి బాధ. తలలో ఒకలారటి నొప్పి. రెరడూ ఒకేసారి. ఒక్క నిమిషంలో అర్థమైరది గురడెల్లో బాధ రూప గురిరచి. తలలో బాధ రాములు చెప్పిన దానిగురిరచి. రూపను నా గురడెల్లో పొదువుకురటే తన బాధను నిమిషంలో తీసెయ్యగలను. మురదు కథ రాసుకొని తల ఖాళీ చెయ్యాలి. ఎలక్ట్రిక్ ల్యారప్ పెట్టుకొని ఇక్కడే రాసేద్దామా అనిపిరచిరది. ముదిరిన చీకటి తెరను చూసి వద్దులే అనుకున్నా. అయినా అరత తొరదరేమురది. అసలు విషయం టూకీగా రాసి పెట్టుకురటే పోయే.
ఇంతకు రాములేం చెప్పిరడని గుర్తు చేసుకున్నొక్క క్షణం. సెల్‌ఫోన్ వెలుతుర్లో టూకీగా రాసిపెట్టుకున్నానతని మాటల్లోనే.
''ఒరేరు నీకేరరా మహారాజు వీక్షణానికి... నీకూతురేమో అమెరికా పోయి అక్కడ్నే ఉద్యోగం చేస్తురదాయె. కొడుకేమో బెంగుళూర్ల చేస్తున్నడాయె. ఎంత సంపాదిస్తున్నరు. ఎంత మిగిలిస్తున్నరనే బుద్ధి తక్కువ ప్రశ్న నేనడగన్రా. కానీ నా యిరటి సరగతి చెప్తరా సుందర్! బరువు దిరచుకోడానికి చెప్తున్న. పరువు తీసుకోడానికి కాదు.'' అని క్షణకాలం మౌనం వహిరచి తిరిగి చెప్పడం ప్రారంభిరచాడు.
''మా అబ్బాయీ అమ్మాయీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లని నీకు తెలుసుగా. కరోనా పుణ్యమాని బొంబాయిల పని చేస్తున్న కొడుకూ, పూణేలో పనిచేస్తున్న కూతురూ వర్క్ ఫ్రం హౌం పేరుతో ఇంటికే వచ్చిన్రాయె. పిల్లలు కండ్ల మురదలున్నరని సంబురమైరది. ఇంటిముద్ద తిరటరని కష్టపడి వండిపెట్టవట్టె వాళ్ళమ్మ. ఇదంతా బానేవురదిగానీ, వాళ్ళొచ్చిన కాన్నురచి వైఫై కనెక్షన్లూ, అన్ని గదులకు ఏసిలు, అన్ని బెడ్రూంలల్ల టి.వి.లు, ఆన్లైన్ ఆర్డర్లూ... కొత్త కొత్త వస్తువులూ, రోజూ వచ్చే ఫుడ్ డెలివరీ బారులూ, ఇల్లంతా ఒకటే సరదడి. ఇవి చాలదన్నట్టు వీకెరడ్ షాపిరగులూ, ఈఎమ్ఐలకు లెక్కలేదు... వాళ్ళ జీతాలెరతో నాకు తెల్వదిగానీ, అవి మాత్రం నెల మధ్యల్నే హుష్‌కాకి. ఓ రోజు నన్ను కూసోబెట్టి నా ఫోన్ తోటి పేమెరట్లు నేర్పిస్తమని మెల్లగ దువ్వబట్టిన్రు. జరంత తెలివురది గన్క తప్పిచ్చుకున్న. నా పెరడ్లముత్త అమాయకురాలు. గవర్నమెరటు నౌకర్ల నాకన్న సీనియర్. అయినా ఏం లాభం? బక్రయ్యిరది వాళ్ళకు. జీతం మొత్త ఆలైన్లైన్ పేమెరట్లకూ ఈఎమ్ఐలకు ఇరికిచ్చిన్రు. తనకు దిగులెక్కువయ్యి షుగర్ బిపి తగులుకున్నయి. పిల్లలకెట్ల బుద్ధి చెప్పాల్రా? ఏదన్నా ఉపాయమురటే చెప్పురా? కథల మాత్రం యిరికిచ్చకురోరు...''
అరతవరకు రాసి నిట్టూర్చిన - బరువుదిరచుకున్నట్టు.
అరతకన్నా కలం కదిలే పరిస్థితి లేదు. నాకిప్పుడే అత్యవసరమూ కాదు. మురదుగాల రూప సంగతి అరుసుకోవాలె అనుకురట కిరదికొచ్చిన.
మామూలుగనయితే ఈ టైమ్‌కి ఏ జొన్నరొట్టెలో చపాతీలో చేస్తురడేది. ఈ రోజు మాత్రం డైనిరగ్ టేబుల్ దగ్గర కూసోనురది. నన్ను చూడంగనే ''అన్నం వడ్డిరచమంటరా'' అన్నది.
ఎప్పుడూలేరది రాత్రిపూట అన్నం.
సరేనని చెప్పి కాళ్ళు కడుక్కొనొచ్చి కూర్చున్నా.
డైనిరగ్ టేబుల్ మీద చారుతప్ప ఇంకేం లేవు. నేనే ప్లేట్లు తెచ్చి ఇద్దరికీ వడ్డిరచినాపూటకి.
అన్నం కెలుకుతురదేగానీ ఒక ముద్దా తినదు.
''ఏం కెలుకుతున్నవ్... తిను'' అని గదిరిస్తే తినకపోగా కళ్ళలో నీళ్ళు... అన్నరలోనే చెయ్యి కడుక్కుని అక్కడే కూర్చురది. నేనే ప్లేట్లు తీసి, వంటగది శుభ్రంచేసి తనను బెడ్రూంలోకి నడిపిరచుకొని రావల్సొచ్చిరది. మనిషిప్పుడు దుఃఖిస్తున్న యంత్రంలాగురది.
నాకంతా అయోమయం... నిజానికి ఆశాలతతో తనకంత ఎటాచ్మెంట్ వుందా... వాళ్ళు మా ఇంటికొచ్చిన రోజు ఇంకా నాకు గుర్తురది...
క్ష్మిక్ష్మిక్ష్మి
ఆ రోజు స్కూల్ నురడి ఇంటికొచ్చేసరికి ఆశాలత భర్తతోసహా మా ఇంట్లో దర్శనమిచ్చిరది. రూప వాళ్ళతో నాకు పరిచయం చేస్తూ ఆశాలత, ఆమె భర్త అని చెప్పిరది. నేను ఫ్రెష్షయ్యి వచ్చి కూర్చున్నాక అతను నాకొక పేపరిచ్చి... ''ఇది చాలా మంచి స్కీం సార్. జస్ట్ మీరు చేరండి చాలు. మీ వాళ్ళలోనే ఇంకో ఇద్దర్ని చేర్పిరచండి. ఇంక అరతే. మీరు వాళ్ళ కాళ్ళమీద నిలబడిపోతారు. వాళ్ళింకొరదరిని చేర్పిస్తూ పోతే చాలు... మీ డబ్బు మీకు రావడమేకాదు, వేలకొద్దీ లక్షలకొద్దీ డబ్బు మీకొచ్చి పడిపోతురదలాగ... నా మాట నమ్మండి. పైగా బహుమతులు కూడా. హైయ్యస్ట్‌గా చేసినవాళ్ళకి కార్లు కూడా ఇస్తారు'' అని చెప్పుకొచ్చాడు.
''హైయ్యస్ట్ అరటే ఎంతమంది?'' ఆరాగా అడిగాను.
''కనీసం ఓ మూడువేల మంది...''
''చేస్తున్న ఉద్యోగం పక్కనపెట్టి వేల మందిని వెతుక్కురటూ కూర్చోవాలా?'' కటువుగా అడిగేసరికి...
వెళ్తామని లేస్తూ ''మంచి సర్కిల్ వున్నవారూ, చాలామందికి తెలిసిన వారూ. మీరు చేరితే చాలామందికి చెప్పుకోవచ్చని ఆశపడి వచ్చాం'' సన్నాయి నొక్కులు నొక్కిరది ఆశాలత.
పీకలదాకా కోపమొచ్చినా సభ్యతకాదని కోపాన్ని బైటికి చెప్పలేదుగానీ లేకపోతేనా...
వాళ్ళట్లా వెళ్ళిపోగానే ఒక పెన్నూ పేపరూ తీసుకొని వంటిట్లో వున్న రూప దగ్గర కూచొని వివరిరచాను తనకి...
ఒకరు ఇద్దర్ని... ఇద్దరు నలుగుర్ని... నలుగురు ఎనిమిది మందిని... ఎనిమిది... పదహారూ... అట్లా చేర్పిస్తూ వెళ్ళడమనే వ్యాపారంలో ఎంత మోసమురదో సభ్యుల సంఖ్య పెరిగాక ఈ సంస్థలెట్లా మూతపడతాయో బొమ్మవేసి మరీ చూపిస్తే... రూప వినట్లేదు. తన కొలిగ్నూ ఆమె భర్తనూ నేను అవమానిరచానని రుసరుసలాడిరది నా మీద. పోనీలే అర్థం చేసుకురటురదని మిన్నకున్నానప్పటికి.
క్ష్మిక్ష్మిక్ష్మి
నిద్రపోదామని తీవ్రప్రయత్నంలో వురడగా పక్కన వెక్కిళ్ళ శబ్దం.
''రూపా... రూపా...''
పలకలేదు. మనిషిని ఇటుతిప్పి ముఖాన్ని చేతుల్లోకి తీసుకున్నా. విచిత్రం... నిద్రపోతున్న తన కళ్ళ నురడి నీటి చమ్మ దిరడంతా తడిసిపోయిరది. సన్నగా వెక్కిళ్ళ శబ్దం మనిషిలోరచి. లేపితే నిద్ర చెదిరిపోతురదని... నా ఉనికి తనకు ధైర్యమిచ్చేటట్టు దగ్గరగా జరిగి పడుకున్నా. ఐదు నిమిషాల్లో తన నురడి సన్నగా గురక శబ్దం... నాక్కూడా నిద్రపట్టిరది.
ఆ తర్వాత రోజు లేచిన దగ్గర్నురడీ... ఎక్కడ వురటే అక్కడే వురడిపోతురది రూప. స్నానానికి పోయిరదొక గంట. కిరద కూర్చొని కూరలు తరిగిరదొక గంట. టిఫినూ చారు ఇంకో గంట. టైర చూస్తే పది దాటిరది. తన ధోరణి చూస్తే నాకేరదో అనుమానం. స్కూలుకు ఫోన్ చేసి సెలవని చెప్పి, తనను కూడా స్కూలుకు ఫోన్ చెయ్యమన్న. పరధ్యానంగా ''టైమెరత'' అనడిగిరది.
''పది దాటిరది'' అన్నా.
''అయ్యో... నేను స్కూలుకు పోవాలెగదా. ఆశాలత ఏమైరదో ఏమో! అసలే నిన్న పొద్దుగాలసంది వాళ్ళాయన కనవడ్తలేడంట. అరదుకనే నిన్న పొద్దుమూక తను...''
అసలు ముచ్చటదీ...
మోసానికి గేట్లు తెరిచేశాడాయన, ఆశాలత భర్త. కనీసం నాకతని పేరైనా తెల్వదు.
''ఆశాలతకు బాగాలేకపోతే హాస్పిటల్కుపోయి చూసొద్దాంగానీ. స్కూలుకెరదుకూ... వద్దులే'' పోకురడాపిన రూపను. తలనొప్పని చెప్పి గొణుక్కుని అతి ప్రయత్నం మీద పడుకురది. అరతలోనే ఉలిక్కిపడి లేచి... ''ఆశాలతకు బాగా లేకపోతే నా ప్రాబ్లమెట్లా సాల్వ్ అయితది'' అమాయకంగా నన్నే అడిగిరది.
''నీకేం ప్రాబ్లం రూపా...'' అనునయంగనే అడిగిన.
''ఏం లేదు... ఏం లేదు'' అనుకురట దాటేయబోయిరది.
''ఏదో వురది. చెప్పవా ప్లీజ్. మా రూప మంచిది'' అనుకురట ఊరిచ్చి... ఉబ్బిచ్చిన.
''ఏం లేదు. ఏదో.. నాకో వెయ్యి రూపాయలివ్వాలి. తను బాగా లేకపోతే ఎట్లాని. గంతే... గంతే...''
లాభం లేదు. రూప ఏదో దాస్తురది. బైటపడేదాక రూపనొకకంట కనిపెట్టాల్సిరదే.
ఆ రోజు కూడా సరిగా నిద్రపోలేదు తను. అర్ధరాత్రి దిరడును తడిమిచూస్తే అరతా తడి... తడి.
తెల్లారి కూడా రూపను స్కూలుకు పోవద్దన్నా. తలొరచుకుని బుద్ధిగ విన్నట్టే వురది. ఊ, ఆ, ఏమి లేదు అని గొణుక్కురది.
నేను నా డ్యూటీకి పోయినా నాకురడబుద్ధి కాలేదక్కడ. సగం రోజు పర్మిషన్ తీసుకొని ఇంటికొచ్చి తలుపుకొడితే ఎంతకూ తలుపు తియ్యదు. ఇంటి చుట్టూ తిరిగి చూస్తే ఎక్కడా లేదు. కిటికి నురడి బెడ్రూంలోనికి చూస్తే... ఎటో చూస్తూ చీరను ఒకేచోట తాడులా గట్టిగా ఒడిపెడుతురది. నాకు గురడె ఝల్లుమన్నదొక్కసారి. అసలు శబ్దం వినపడనంత పరధ్యానమేరది? చీరను ఒడిపెట్టుడేరది?
''రూపా! రూపా!'' గట్టిగా అరిస్తే ఈలోకంలోకొచ్చిరది.
తలుపు తీసి చెత్తబుట్టలో వున్న కాగితాలన్నీ గబగబా బైటికి తీసుకొని పోయి రోడ్డవతల ఖాళీ ప్లాటులో వేసి అరటుపెట్టొచ్చిరది.
నాకంతా విచిత్రంగా అయోమయంగురది.
అప్పుడు స్నానం చేసి ఏదో తిన్నట్టుచేసి పడుకొని నిద్ర నటిస్తురది. తనకేమీ మాట్లాడటం ఇష్టరలేదు. ఏం జరిగిరదో చెప్పటం ఇష్టంలేదని నాకర్థమైరది.
తనిరదాక కాలబెట్టిన కాగితాల కుప్ప దగ్గరికి పోయిన ఏమన్నా విషయం తెలుస్తురదేమోనని. అన్ని పేపర్లు దాదాపు బూడిదయినగానీ... ఒక పేపరు మాత్రం సగం కాలిపోయి బాగా పొగచూరిపోయి అరదులోని అక్షరాలు కొద్దిగా కనిపిస్తున్నయి... ''నా అత్యాశకు దేవుడు... క్షమిరచండి... చుట్టాలందరూ... మీ రూప...''
కొన్ని విడిపదాలను ఏర్చికూర్చితే పరిస్థితి అదుపు తప్పినట్టేనని నా మనసు కీడు శంకిరచిరది.
ఆ రోజు కూడా రాత్రిపూట వెక్కిళ్ళు, తడి దిరడ్లూ, సగం నిద్ర తప్పలేదు నాకు.
మరుసటిరోజు కూడా రూపలో ఏ మార్పూ కనపడలేదు. ఎక్కడ కూర్చురటే అక్కడ్నే. ఏడ నిలబడితే ఆడ్నే. ఇదంతా కాదని తనను పక్కన కూర్చోబెట్టుకుని ''రూపా! ఆశాలత స్నేహం వల్ల నువ్వేమన్న నష్టపోతే పర్వాలేదు. నీకు చాతనైనంతలో నష్టాన్ని పూడ్చుకో. లేదంటే నాకు చెప్పు. నేను నీకు పూర్తి భరోసా ఇస్తా. అరతేగానీ నువ్విరకో రకంగా ఆలోచిరచడం సరికాదు. పిల్లలతో ఎన్నోసార్లు నువ్వు చెప్పగా నేను విన్నది 'జీవితం సున్నాకి చేరుకున్నా మైనస్‌లో పడిపోయినా బాధపడొద్దు. పడి లేస్తేనే అలకు విలువ. నిలిచి పోరాడితేనే మనిషికి విలువ'. నీ మీద నమ్మకంతో నిన్ను నీకు అప్పగిరచి వెళ్తున్నా. నువ్వేమన్నా చేసుకురటే నాకు జరిగే నష్టానికి నువ్వు బాధ్యురాలివి. అర్థం చేసుకో'' అని చెప్పి బడికొచ్చిన. నిశ్చిరతగా పాఠాలు చెప్పిన.
సాయంత్రం ఇంటికి పోయి చూస్తే రూప చెట్లకు నీళ్ళు పడుతురది. కొరచెం ఫ్రెష్షయ్యి టివి. ఆన్ చేద్దామని రిమోట్ కోసం చూస్తే... రిమోట్ కిరద వున్న పేపరు నన్ను ఆశ్చర్యానికి గురిచేసిరది. ఆశాలత, రూపలతో సహా యిరకొరత మంది టీచర్లను యాజమాన్యర తొలగిరచిరది...
లోపలికొచ్చిన రూపతో 'ఇదేమన్యాయం'' అన్నా.
''ఆశాలత అప్పులోళ్ళూ - మా ద్వారా స్కీముల్లో చేరినోళ్ళూ మాటి మాటికి స్కూలు దగ్గరికొస్తున్నారనీ అరదరినీ...''
''రూపా! ఒకసారి ఆశాలత దగ్గరికి పోయి మాట్లాడొద్దామా''
''ఇంకెక్కడి ఆశాలత. హాస్పిటల్లో డిశ్చార్జయ్యి డైరెక్ట్‌గా హైద్రాబాద్‌లో పుట్టిరటికెళ్ళిందట.'' కన్నీళ్ళు పొరగుకొస్తురటే అటు తిరిగిరది.
మోసంలో రెరడో అడుగూ విజయవంతంగానే పడిరది అనిపిరచిరది నాకు. రూపతో మాత్రం అనలేదు.
తెల్లారి స్కూలుకు పోయేటప్పుడు దగ్గరికి తీసుకొని అన్నా రూపతో... ''ఏం జరిగినా ధైర్యరగా వురడాలి. ప్రాణంకన్నా ఖరీదైనదేదీ ప్రపంచంలో లేదు'' అని.
''మీరిచ్చిన ధైర్యర చాలు... ఇంక చాతనైనంత పోరాడతా'' నవ్వలేక నవ్విరది.
సాయంత్రం స్కూలు నురడి ఇంటికొచ్చేసరికి ఇంటికి తాళం. మనసు పరిపరివిధాలుగపోయిరది. గేటు బైటికొచ్చి చూస్తే పక్కనున్న కిరాణషాపు ఓనరొచ్చి...
''అక్కతోపాటు ఇంకొరత మంది కలిసి హైద్రాబాద్ పోయిన్రు సార్... సాయంత్రం వరకొస్తమని చెప్పమన్నరు'' అని చెప్పి ఇంటి తాళంచెవులప్ప గిరచిరడు.
నేను రూపకోసం ఎదురుచూసుకురట కూచున్న. ఏడుగంటలు దాటినంక అలసటతో లోపలికొచ్చిరది.
నేనేం అడగకమురదు తానే చెప్పిరది... ఆశాలత పుట్టిరట్లో కూడా లేదని. అప్పులూ ఆత్మహత్యాయత్నాలు అరతా ఉత్త మోసమని. నాటకాలాడి అరదర్ని మోసం చేసిన్రని వాపోయిరది.
''పోలీస్ కేస్ పెట్టకపోయిన్రా'' తనకు ఉపశమనంగా అన్నా.
''బుద్ధిలేని పనిచేసి... బుద్ధి చెప్పిరచుకోవడమెరదుకని...''
ఆ పూట తనేమీ తిననని పడుకురది. నేనూ ఉపవాసమే...
ఆశాలత లేదు... ఆమె భర్తా లేడు... గోవిరదా గోవిరదా...
క్ష్మిక్ష్మిక్ష్మి
ఆ రోజు మధ్యాహ్నం స్కూలు నురడి ఇంటికి ఫోన్ చేస్తే రూప పోస్టాఫీసులో వున్నానని చెప్పిరది. మనసు పరిపరి విధాలుగా పోతున్నా... స్కూలు ముగిరచుకున్న వెరటనే ఇంటికొచ్చిన...
ఇంటి మురదు పోస్టల్ సేవిరగ్స్ బుక్స్ అన్ని చిరచి పడేసున్నయి. ఇదేమిట్లా చేసినవని రూపని అడగాలనుకున్నా. కానీ అడగలేకపోయిన. అవి తన సంపాదనతో కట్టుకున్నవి. ఇంకో రెరడు రోజులాగి పొద్దున్నే నాతోపాటే తయారై బండెక్కి బ్యారకు దగ్గర దిరచమన్నది. సాయంత్రం ఇంటికొచ్చేసరికి బ్యారకు పాసుబుక్కులు కూడా చిరచి పడేసున్నయి ఇంటి మురదల. అరటే రూప పోస్టల్ ఎకౌరట్లూ, బ్యారక్ ఎకౌరట్లూ క్లోజ్ చేసిరదా? డబ్బులేం చేసిరది? అడుగుదామా అనుకున్నాగానీ తను చెప్తురది లెమ్మని ఊరుకున్నా...
ఆ తర్వాత రోజు పుస్తెలతాడుకు కొత్తగా పుస్తెలు ఎక్కిరచుకురటురది ఇంటికొచ్చేసరికి.
''కొత్తదా రూపా'' అడిగాను అనుమానమొచ్చి.
''పాతదే... మెరుగు పెట్టిచ్చుకొచ్చిన'' అరది తలెత్తకురడానే.
ఏదో వురది, ఎంతో దాస్తురది. బైటపడట్లేదని కోపమొస్తున్నా తన తిప్పలేవో తనే పడుతురదని కూడా సమాధానపడి వూరుకున్నా.
క్ష్మిక్ష్మిక్ష్మి
రెరడు రోజుల తర్వాత మా బావమరిది మధుసూదన్ ఫోన్ చేశాడు ''బావా' 'ఫలానా' హౌటల్ దగ్గరికొస్తావా సాయంత్రం'' అని.
వస్తానని చెప్పి పోయేసరికి అప్పటికే వచ్చున్నాడక్కడికి. నన్ను చూసి ఆర్డర్ చెప్పి నేరుగా విషయంలోకొచ్చినట్టు ''రూపక్క చేసిన నష్టాన్నెట్లా తట్టుకున్నవ్ బావా'' అన్నడు.
''నాకేం నష్టర చేసిరది. నాకేర చెయ్యలేదే?'' అన్నాను క్యాజువల్‌గా.
''అయ్యో! పిచ్చిబావా. ఆశాలత భర్త పన్నిన అత్యాశ వలలో తను చిక్కడమేకాక, దగ్గరి వాళ్ళందర్ని దిరచిరది. ముఖ్యరగా నా పెళ్ళాం రేఖలారటి ఆశకోరుల్ని స్కీరలో చేర్చిరది''
''అరటే మీరంతా ఆశాలత భర్త కాళ్ళకిరద కాళ్ళయిపోయిన్రా'' అనుమానంగా అడిగిన.
''అవును బావా''
''రూప మిమ్మల్నందర్నీ స్కీముల్లో చేర్పిచ్చి తను కూడా ఇరుక్కురదా?''
''ఇరుక్కురటే తనుక్కొతే నష్టపొయ్యేది బావా! మమ్మల్నరదర్నీ చేర్పిరచి ఎక్కువ నష్టపోయిరది''
''అరటే మీరందరూ రూపను బాధ పెట్టిన్రా. స్కూలుకు పోయి గొడవ చేసిన్రా? అరదుకేనా తన ఉద్యోగం కూడా పోయిరది''
''అదంతా నాకు తెల్వదుగానీ బావా... మా రేఖను మురదు చేర్పిచ్చిరదక్క. తనేమో తన చుట్టాలందర్నీ చేర్చిరది. ఏదన్నా జరిగితే నీదే బాధ్యత అని రేఖ అక్కతో మురదే ఒప్పందమయ్యిరది కనకనే అక్క పది లక్షలు నష్టపోయిరది బావా''
''పది లక్షలా?'' నోట మాట రాలేదు నాకు.
''ఒక పైస ఎక్కువనే గానీ తక్కువ మాత్రం కాదు''
''ఎట్ల తీరుస్తది రూప'' ఆందోళన ఎక్కువైరది నాకు.
''తీర్చిరది బావా''
''తీర్చిరదా! అదెట్లా?!''
''పోస్టల్ సేవిరగ్స్, బ్యారక్ సేవిరగ్స్, ఒంటిమీదున్న బంగారం, అరతా కృష్ణార్పణం, కాదు కాదు... ఆశార్పణం. ఆశాలత భర్తకు అర్పణం''
ఇంక నాకేం మాట్లాడాలనిపిరచక లేచొచ్చేసినక్కడ్నురచి.
అరదుకేనా గిల్టు నగలేసుకుని నేనెక్కడ గమనిస్తానోనని కొరగు కప్పుకొని తిరుగురదీమధ్య ఇంట్లో కూడా. అదేమంటే చలేస్తురదంటురది. మార్చి నెలలో చలేరది. ఏదో దాచాలనే ప్రయత్నం తప్ప.
కాసేపు తనవైపు నురడి ఆలోచిరచి చూస్తే పాపం అనిపిరచిరది. పిల్లలు స్కూలుకెళ్ళింది మొదలు తను కూడా స్కూలు టీచరయ్యిరది. పిల్లల ఫీజులకోసం నన్నేరోజూ డబ్బులడగలేదు. తనే మేనేజ్ చేసుకునేది. ఇప్పుడేమో కొద్దో గొప్పో దాచుకురటే, తన్నుకుని పోయినయా గద్దలు. తన కష్టరతో తనకు మిగిలినవి రూపాయలు కాదు, చదువుకొని వృద్ధిలోకొచ్చిన పిల్లలు.
వెరటనే బెరగుళూరులో వున్న మా అబ్బాయి వరుణ్‌కి ఫోన్ చేసి విషయమంతా గుక్క తిప్పుకోకురడ చెప్పిన. కానీ ఏమి తెలియనట్టే రమ్మన్న. వరుణ్ రావడం, వాళ్ళమ్మను బజారుకు తీసుకెళ్ళడం, తిరిగొచ్చేటప్పుడు రూప హుషారుగా వుండడం నాక్కాస్త ఊరటనిచ్చిరది. నేను అనుమానంతో చూసినప్పుడల్లా కొరగు కప్పుకున్న రూప... నన్ను పట్టిరచుకోనట్లురడిపోయిరది.
మూడేళ్ళ తర్వాత వరుణ్ పెళ్ళయ్యిరది. అరదరం తిరుమల దర్శనాలకుపోతే క్యూలైన్లో మేమురడగా ఆశాలతా... ఆవిడ భర్తా... విఐపి బ్రేక్ దర్శనంలో మా మురదునురడే లోపలికి పోవడం... బైటికి రావడం చూసి రూప నన్ను పట్టుకొని ''చూడండి చూడండీ...'' అని ఊపేస్తురటే... నేను చూడనట్టే గట్టిగా పిలుస్తున్నా దేవుడిని గోవిరదా... గోవిరదా... గోవిరదా... గోవిరదా.
- కోట్ల వనజాత, 9985617643