Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • కామారెడ్డిలో కరోనా కలకలం
  • ఢిల్లీలో కొత్తగా 17,282 కరోనా కేసులు
  • తొలి వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్
  • రాజస్థాన్‌లోనూ రాత్రిపూట కర్ఫ్యూ
  • సన్‌రైజర్స్‌ లక్ష్యం 150
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
నిజమైన దేశభక్తుడు... | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి

నిజమైన దేశభక్తుడు...

Tue 02 Mar 04:17:22.753159 2021

తొంభై సంవత్సరాల క్రితం ఒక విద్యార్థిని ఒక స్కూలు యాజమాన్యం ఆస్కూలు నుంచి వెళ్ళగొట్టింది. దేశభక్తితో స్పందించి, బ్రిటిష్‌వాళ్ళు ఈ దేశం నుంచి వెళ్ళిపోవాలని కోరుతూ రాజకీయ కార్యక్రమంలో పాల్గొనడమే ఆ విద్యార్థి చేసిన నేరం. ఇన్నేండ్ల తర్వాత ఆ స్కూలుకి ఆ విద్యార్థి పేరు పెడుతూ పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ పేరే హరికిషన్‌సింగ్‌ సూర్జిత్‌... జలంధర్‌ జిల్లాలోని ఫిల్లావుర్‌ తాలూకాలో 'బుందాలా' అనే గ్రామం ఉంది. అక్కడి హైస్కూలుకు ''కామ్రేడ్‌ హరికిషన్‌సింగ్‌ సూర్జిత్‌ సీనియర్‌ సెకండరీ స్కూల్‌'' అని పేరు పెడుతూ ముఖ్యమంత్రి అమరిందర్‌ సింగ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇరవయ్యవ శతాబ్దం ప్రారంభ సంవత్సరాల్లో సిఖ్‌ లహర్‌ (సిక్కు తరంగం) పేర అక్కడి ప్రజల విద్యావికాసం కోసం ఉద్యమం నడిచింది. ఆ ఉద్యమంలో భాగంగా బుందాలాలో ఖల్సా మిడిల్‌ స్కూల్‌ పేర ఒక స్కూలు స్థాపించబడింది. తర్వాత అది హైస్కూలుగా పెరిగింది. 1920 దశకం చివరిభాగంలో సూర్జిత్‌ ఆ స్కూలులో విద్యాభ్యాసం చేశారు. ఆ కాలంలోనే అదే స్కూలులో పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి దర్బారా సింగ్‌, మాజీ కేంద్ర మంత్రి స్వరణ్‌ సింగ్‌ కూడా చదివారు.
సూర్జిత్‌ తండ్రి హర్నామ్‌ సింగ్‌ కూడా స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుడే. ఆయన ఇంటికి తరచూ ఉద్యమ నాయకులు వస్తూండేవారు. 1931లో గదర్‌ ఉద్యమనేతలు గద్రీ బాబా, కరమ్‌ సింగ్‌ చీమా, బాబా భాగ్‌సింగ్‌ కెనడియన్‌, ఉప్పల్‌ భూపా ఆ ఇంటికి వచ్చారు. అప్పటికి సూర్జిత్‌కు 15 ఏండ్లు ఈ నాయకులు ఆ బాలుడిని గురుద్వారాలో సమావేశం ఏర్పాట్లు చేయమని చెప్పారు. అప్పుడు సూర్జిత్‌ గురుద్వారాకు పోయి... అక్కడి పెద్ద గంటను మోగించి, మీటింగు జరగనుందని ప్రకటించి, బల్లలు, కుర్చీలు, పట్టాలు ఏర్పాటు చేశాడు. సభకు జనం బాగా హాజరయ్యారు.
ఆ మర్నాడు స్కూలుకి పోలీసులు వచ్చారు. రాజకీయ సమావేశం ఏర్పాటు చేసినందుకు క్షమాపణలు కోరాలని సూర్జిత్‌పై ఒత్తిడి తెచ్చారు. అందుకా కామ్రేడ్‌ సుతరామూ అంగీకరించలేదు. చివరకు సూర్జిత్‌ను ఆ స్కూలు నుంచి తొలగించారు. దూరంగా జలంధర్‌లోని వేరే ఒక స్కూలులో సూర్జిత్‌ చేరవలసి వచ్చింది.
1967 ఎన్నికలలో కామ్రేడ్‌ సూర్జిత్‌ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆ స్కూలులో ఒక కార్యక్రమం నిర్వహించి దానికి రాష్ట్ర విద్యామంత్రి లక్ష్మణ్‌ సింగ్‌ గిల్‌ను ఆహ్వానించారు. ఆ సమావేశంలో విద్యామంత్రి ఆ స్కూలును ప్రభుత్వ స్కూలుగా నిర్వహిస్తామని ప్రకటించారు. కాలక్రమంలో అది సీనియర్‌ సెకండరీ స్కూలుగా ఎదిగింది.
హరికిషన్‌సింగ్‌ సూర్జిత్‌ మరణా నంతరం, రెండవ వర్ధంతి సందర్భంగా ఆ స్కూలుకు ఆయన పేరు పెట్టడానికి ప్రభుత్వం అంగీకరించింది. అయితే అది అమలుకు నోచుకోలేదు. ఇటీవల మళ్ళీ ఆ విషయాన్ని పంజాబ్‌ రాష్ట్ర సిపిఎం సీపీఐ(ఎం) కార్యదర్శి సుఖ్విందర్‌సింగ్‌ సెఖన్‌ ప్రభుత్వం దష్టికి తీసుకు వచ్చారు. మొత్తానికి ప్రభుత్వం కదిలింది. నిజమైన దేశభక్తి అంటే సామ్రాజ్యవాదులకు మోకరిల్లడం కాదని, స్వాతంత్య్రాన్ని కాపాడుకోవడమే అసలైన ఆత్మనిర్భరత అని ఆచరణలో చూపించిన సూర్జిత్‌ నేటి యువతరానికి ఆదర్శం.
(ఫీచర్స్‌ అండ్‌ పాలిటిక్స్‌)

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అమెరికా నౌక - అక్రమ చొరబాటు
కోవిడ్‌ విజృంభిస్తోంది.. ప్రభుత్వం ఏంచేస్తోంది..?
వి'ప్లవ' నామ సంవత్సరం
రాజ్యాంగ రక్షణే అంబేద్కర్‌కు నివాళి
ఆయన అమరత్వం చిరకాలం...
ప్రధాని పాఠాల ప్రయోజనమేమిటి?
పాలక వర్గాలు - పేదలపట్ల శ్రద్ధ
లాల్‌ సలామ్‌!
ఐదు మూసుడు పది అమ్ముడు
చిరకాల స్పూర్తి....... మన బొజ్జి !!
పంచతంత్రంలో పారని మోడీమంత్రం!
క్రాంత దర్శి
తారా లోకం!
పాఠశాల విద్యలో వినూత్న పథకం ఎలా ఉండాలి..?
న్యాయవ్యవస్థే చట్టాన్ని ధిక్కరిస్తే...?
భాయీ భాయీ..
మన పురాణ పాత్రల మూలాలు ఈజిప్టులో ఉన్నాయా?
ఆన్‌లైన్‌ విద్యతో విద్యార్థులకు ఒరిగేదెంత?
ఉచిత వరాలతో అభివృద్ధి సాధ్యమా?
ప్రతిభ-అసమర్థత-రిజర్వేషన్లు
తమిళ అస్తిత్వంలో మార్పు..!
ఫూలే, అంబేద్కర్‌లు కులనాయకులా?
కాగ్‌ పట్టి చూపిన ఆర్థిక నిర్వాకపు మెతుకు
స్వీయహత్యల దోషులెవరు?
సుఖాంతమైన సూయజ్‌ ఓడ కథ..
ఐఎంఎఫ్‌ నిజ స్వరూపం
సార్వత్రిక ఆహార భద్రత కల్పించాలి
బత్తాయిలు... కరెంట్‌ షాక్‌
''ఉపా'' ఓ రాజ్యాంగ విరుద్ధమైన చట్టం
మధ్య తరగతిని చిత్తు చేసిన కరోనా మహమ్మారి
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.