Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మౌనమేలో పాలకా?
రెజ్లర్ల పరువు పోరుపై
కన్నీటి తెరల తీరుపై
వారడగ లేదు పదవి
బ్యాంకప్పు అడగలేదు
ఏ బిరుదు అడగ లేదు
మీ ఆస్తు లడగ లేదు
స్త్రీ లోలిత కైపెక్కిన
బ్రిజ్ భూషణ మాటపై
న్యాయమే అడిగినారు
'మాన'హక్కు లడిగినారు
పతకాలూ గెలిచి నపుడు
పరవళ్ళు తొక్కి నారు
'పరువీ'ధీ కెక్కి నపుడు
అండెందుకు ఇవ్వ లేదు?
ప్రశంసలా పలుకుల్లో
చేతల్లో ములుకులా
మీ శీలమంటే ఇంతేనా?
మీ జ్ఞానమంటే ఇదేనా?
అని లోకం భగ్గుమంది
కళ్ళార్చిన పిల్లి ఆట
కలకాలం సాగబోదు
బ్రిజ్ భూషణ్ తీరుపై
చర్యేమిటో చెప్పాలి
మౌనం మీ తీరైతే
స్త్రీలోకం కదులుతోంది
యవతరం అండగుంది
మీ వైఖరి కక్కించగ
ఎక్కిన మీ కైపు దించ
కదులుతోంది భారతం
ఇదే..ఇదే తీరునయితె
పదం పాడి కదం తొక్కి
రెజ్లర్లకు సలాం చేసి
మీ మదం దించుతారు
- ఉన్నం వెంకటేశ్వర్లు
సెల్:8790068814