Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంతా స్మార్ట్ ఫోన్ల మాయ. చేతిలో ఒక్కరోజు ఫోన్ లేకపోతేనే అల్లాడిపోతున్న కాలమిది. సామాన్యులు సైతం అప్పోసప్పో చేసి కొనేస్తున్నారు. అదీ కుదరకపోతే వాయిదాల చెల్లింపుల పద్ధతిలోనైనా ఫోన్ కొని హమ్మయ్యా !అని ఊపిరిపీల్చుకుంటారు. సన్నిహితులకు, తమకు అవసరమున్న వారందరికీ ఫోన్ చేసి మరీ కొత్త ఫోన్ కొన్నా అని చెబుతున్నారు. ఇదీ నడుస్తున్న కాలం. కానీ, బండి సంజరు చెబుతున్న సమాధానాలు మాత్రం నలుగురికీ నవ్వు పుట్టిస్తున్నాయి. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావుతో ఈటల బృందం భేటీ అవుతున్నదంటగా అని మీడియా ప్రశ్నిస్తే తనకు ఆ విషయం తెలియదని బండి చెప్పేశాడు. పైగా, తన దగ్గర ఫోన్ లేదు కాబట్టి సమాచారం ఇవ్వలేదని దాటేశాడు. నిజంగానే ఆయన ఫోన్ పోయిందే అనుకుందాం. ఒక ఎంపీగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న బండి సంజరుకుమార్ దగ్గర నెల రోజులకు పైగా ఫోన్ లేకుండా ఉండటమంటే అది ప్రపంచంలో ఎనిమిదో వింతనే అయి ఉంటుంది. గల్లీనాయకుండే ఫోన్ లేకుంటే అల్లాడిపోతుంటారు..ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడివి అయ్యి ఉండి ఫోన్ లేదంటే ఎట్లా స్వామీ?. ఏది చెబితే అది వింటున్నరని ప్రజల చెవ్వుల్లో పువ్వ పెట్టడమెందుకు బండీ. ఇట్లనే మాట్లాడుకుంటూ పోతే నాలుగురోజులైతే ఎవ్వరూ నీ మాట నమ్మరు జర చూసుకుని మాట్లాడు స్వామీ.
- అచ్చిన ప్రశాంత్