Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీదతనం, పేదరికం, దరిద్రం... ఇలా పేర్లేవైనా భావం ఒక్కటే. కాంగ్రెస్ పార్టీ అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారానికి దూరమై పదేండ్లు దాటింది. ఇప్పట్లో అప్పటి రాజసం వస్తుందో లేదో అనే డౌట్ అలాగే ఉంది. తాజాగా ఆపార్టీ ప్రియాంకగాంధీని హైదరాబాద్‌కు పిలిపించి, పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేశారు. సరూర్‌నగర్ స్టేడియం చుట్టుపక్కల రోడ్లకు అటూ, ఇటూ ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టి ఏదో హడావిడి చేసే ప్రయత్నం చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. మీటింగ్‌కు వస్తున్నామె కాంగ్రెస్‌పార్టీ వారసురాలు. ఒక్కసారి కనీసం తమ ఫొటో అయినా ఆమె కంట్లో పడితే చాలనుకొనే ఔత్సాహిక పార్టీ నేతలు భారీగానే బ్యానర్లు కట్టారు. కాకపోతే... ఆ బ్యానర్లు ముద్రించిన ప్రింటర్‌కి డబ్బులు ఇచ్చారో... మళ్లీ ఇస్తాం... అని చెప్పారో ఏమో..! అన్ని ఫ్లెక్సీల్లోనూ వెలిసిపోయిన పాత రంగులే తప్ప, కొత్తగా ఇంకు పోసినట్టు కనిపించలేదు. మీటింగ్ అయ్యాక ఆ నేతలు అలవాటు ప్రకారం డబ్బులు ఇస్తారో లేదో అనే డౌట్‌తో సదరు ప్రింటర్ తనదగ్గరున్న పాతరంగునంతా వాడేసినట్టున్నాడని పబ్లిక్ కామెంట్. ఒక్క ఫ్లెక్సీలో ఓ 50 మంది ఫోటోలు ముద్రించుకున్నారు. అదేదో హౌలీ పండక్కి రంగునీళ్లు కుమ్మరించినట్టు తెల్లఫ్లెక్సీలు రకరకాల రంగుల్లోకి మారాయే తప్ప, అందులో ఉన్న ఒక్కరి ముక్కుమూతీ సక్కంగ లేకపాయే! అధికారంలోకి రాలేకపోతే... పెట్టిన పెట్టుబడి వృధా అనుకున్నారో, ఒక్క రోజు భాగ్యానికి అంత భోగం ఎందుకనుకున్నారో, ఏదో పెద్దోళ్లు పెట్టమన్నారని మొహమాట పడ్డారో... ఫ్లెక్సీలు కట్టేటప్పుడే వెలిసిపోయి ఉండటం ఆపార్టీ పదేండ్ల దరిద్రాన్ని కండ్లకు కడుతుందంటూ అపోజిషనోళ్ళు ఎకసెక్కాలాడుతున్నారు సామీ!!
- ఎస్ఎస్ఆర్ శాస్త్రి