Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా... లాక్ డౌన్...ఆన్లైన్ చదువుల పుణ్యమానీ స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడిన పిల్లలు వాటిని వదిలి ఉండటం లేదు. నగరాలు, పట్టణాల్లో పిల్లలైతే మరీ ఆటలకు పూర్తిగా దూరమై ఆన్లైన్ గేమ్లకు వ్యసనపరులుగా మారిపోయారు. ఆఫ్ లైన్ చదువులకు పరిమితం కాగా, మళ్లీ వేసవిలో స్మార్ట్ ఫోన్ల అల్లరి మొదలైంది. ఫోన్ ఇస్తే ఒక బాధ...ఇవ్వకపోతే ఒక బాధ అన్నట్టుగా తల్లిదండ్రుల పరిస్థితి తయారైంది. దీంతో పిల్లలను దాన్నుంచి డైవర్ట్ చేసేందు కన్నట్టుగా నగరాలు, పట్టణాల్లో వీధి, వీధికొకటి అన్నట్టుగా సమ్మర్ క్యాంపులు పుట్టుకొస్తున్నాయి. ఇందులో కళలకు సంబంధించినవి కొన్నైతే, మరికొన్ని క్రీడలకు సంబంధించినవి ఉంటున్నాయి. ప్రభుత్వం నుంచి కొన్ని క్యాంపు లను నిర్వహిస్తున్నా.... మారిన పరిస్థితుల్లో భవిష్యత్ తరం కోసం వాటిని మరింత పెంచాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. స్మార్ట్ ఫోన్లు, టీవీలు, కంప్యూటర్ల వంటి వాటికి అతుక్కుపోయే పిల్లలు చురుకుదనం కోల్పోతున్నారని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం పట్టించుకుంటుందా?....
- కె.ప్రియకుమార్