Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొందరు ప్రేమ లేకపోయినా వారి స్వార్థం కోసం ప్రేమించినట్టు నటిస్తుంటారు. ఇది నటన అని కూడా గుర్తించం. నటనలో అంతగా జీవిస్తారు. ఇలాంటివి సినిమాల్లోనే కాదు..నిత్య జీవితంలోనూ అటువంటి వారు మనకు తారసపడుతున్నారు. అయితే అటువంటి స్వార్థపరుల నిజస్వరూపాన్ని పసిగట్టడం అంత ఈజీ కాదు. అటువంటి మహానటులు కొంత మంది 'ది కేరళ స్టోరీ' చిత్రంపై ఘాటు ప్రేమను కురిపిస్తున్నారు. బత్తాయిగాళ్లు బలవంతంగా ఆ చిత్రాన్ని చూపిస్తున్నారు. అబిడ్స్‌లోని ఓ థియేటర్లో మొదటి ఆరోజు ఆటకు జనమే లేరు. కానీ ముందే చేసుకున్న ప్లాన్ ప్రకారం గుంపులు, గుంపులుగా అక్కడికి చేరుకున్నారు.అక్కడే హోటల్లో టిఫిన్లు తినిపించారు. టీలు తాగించారు. జై రామ్ అంటూ నినాదాలు చేస్తూ...ర్యాలీగా థియేటర్లోకి వెళ్లారు. దీన్ని బట్టి ది కేరళ స్టోరీ చిత్రాన్ని జాకీపెట్టి లేపుతున్నాయి ఆర్ఎస్ఎస్ మూకలు. ఏ ఆధారాలు లేని మాయబజారును తలపించేలా 'ది కేరళ స్టోరీ' అనే విషపు పామును ఆర్ఎస్ఎస్ బయటకు వదిలింది. అప్పటికే ప్రజలు ఆ పాముల కోరలు పీకేశారు.ఈ క్రమంలో మూలిగే నక్కపై తాటిపండు పడినట్టు...గుజరాత్ మహిళల అక్రమదందా వెలుగులోకి వచ్చింది. 41వేల మంది అదృశ్యమైనట్టు ఎన్సీఆర్బీ తేల్చింది. దీనికి ప్రభుత్వ లెక్కలు పక్కగా ఉన్నాయి. ఆ సినిమాను తొక్కి పెట్టింది. కేరళ స్టోరీ సిని మాను బ్లాక్‌బస్టర్ చేయాలని భావించారు. కానీ సీన్ రివర్సయింది. థియేటర్లలో జనం లేక వెలవెలబోతు న్నాయి. పెట్టిన సొమ్ము రాబట్టుకు నేందుకు చిత్ర బృందం ప్రమోషన్ కోసం బీజేపీ ముఖ్య మంత్రులు, కేంద్ర మంత్రుల వద్దకు తిరుగుతున్నారు. సినిమా ఫెయిలై బోల్తా కొట్టింది. కానీ చిత్ర నిర్మాత, దర్శకుడు కచ్చితంగా బీజేపీ పాలనలో పాస్ అవుతారు. ఇది సత్యం.
- గుడిగ రఘు