Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అందుకే నాడు విభజించి పాలించిన బ్రిటిష్ పాలకుల ఎత్తుగడనే బీజేపీ పాలకులు మరింత దూకుడుగా పాటిస్తున్నారు. అందుకు 'మత విద్వేషాన్ని' ఆయుధంగా మలుచు కున్నారు బీజేపీ పాలకులు! మత విద్వేషానికి సులభంగా లోనవుతున్నారు ప్రజలు. పామరులేకాదు, పండితులు, విద్యావంతుల్లోనూ చాలామంది ఈ మత విద్వేషానికి లోనుకావటం బాధాకారం. ఇదే బీజేపీకి అందివచ్చిన అవకాశం. బహుశా అందుకేనేమో 'మతం మత్తుమందు' అన్నారు కారల్‌మార్క్స్!
మెజారిటీ పేదల ఓట్లతో గద్దెనెక్కి, కొద్దిమంది కోటీశ్వరులను కుబేరులుగా ఎక్కదీస్తూ, కోట్లాది పేదలను నిరుపేదలుగా దిగజార్చే పాలక పార్టీ బీజేపీ. ప్రపంచ కుబేరులలో 10, 12 స్థానాల్లో ఉన్న అంబానీ ఆదానీలను 3,2 స్థానాలకు, అదే సమయంలో కోట్లాది పేదలను, నిరుపేదలుగా దిగ జార్చింది మోడీ ప్రభుత్వం! అంబానీ, ఆదానీలు న్యాయబద్ధంగా వ్యాపారాలు చేసి ఎదిగితే తప్పు బట్టాల్సిన పనిలేదు. కానీ వాళ్ళలా ఎదగలేదు, రూ.లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తుల్ని, వేలకోట్లకే కట్టబెట్టిన మోడీ పాలన ఫలితమది. రూ. 3లక్షల కోట్ల విలువైన భూములు, ఆధునాతన మిషనరీ ఉన్న 'విశాఖ ఉక్కు'ను కేవలం రూ.3వేల కోట్లకు తెగనమ్మేందుకు సిద్ధపడిందని ఆ కంపెనీ స్టాఫ్ బహిరం గంగానే ప్రకటించింది నిజమేకదా! అంతే గాదు, వేల కోట్ల ప్రజాధనంతో ప్రత్యేక విమానంలో తిరిగి, అమెరికా, రష్యా, చైనా, జపాన్, ఆస్ట్రేలియా, శ్రీలంక, బంగ్లాదేశ్ వగైరాలతో కేవలం ఆదానీ అంబానీలకే లక్షల కోట్ల విలువైన కాంట్రాక్టులు, వ్యాపార లావాదేవీలను కుదిర్చిపెట్టినట్లు అంతర్జాతీయ నివేదికలు గణాంకాలతో బయట పెట్టాయి. ఆదానీగానీ, అంబానీగాని ఈ దేశంలో కొత్తగా ఒక్క పరిశ్రమనైనా పెట్టలేదు. మోడీ పట్టుబట్టినా వాళ్ళు కొత్త పరిశ్రమను పెట్టరు గాక పెట్టరు. ఎందుకంటే? దేశంలో కోట్లాది పేదలు నిరుపేదలుగా దిగజారి కొనుగోలుశక్తిని కోల్పోయారు గనుక! కొనేవాళ్ళు లేనప్పుడు కొత్తగా పరిశ్రమలు రాకపోగా, ఉన్న ఫోర్ట్ లాంటి విదేశీ పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి. 'యాపిల్' కంపెనీ వార్షికాదాయం 3.1 ట్రిలియన్ డాలర్ల కంటే తక్కువ. అదే చైనా వార్షికాదాయం 16.5 ట్రిలియన్ డాలర్లు. గత మూడు దశాబ్దాలుగా చైనా జీడీపీ రెండంకెల్లో కొనసాగుతుంది. ప్రపంచం తలెత్తి చూసేలా మన జీడీపీని పెంచుతానన్న మోడీ పాలనలో డబుల్ డిజిట్ అంతేసంగతి. 9, సింగిల్ డిజిట్లో కూడా పతన మార్గాన జారు తున్నది. ఇందుకు కారణం మన వంటి వ్యవసాయక దేశాలు చైనా వగైరాలను కాక, తద్భిన్నంగా పారిశ్రామిక దేశాల విఫలనేతల మార్గాన మోడీ పయనించటమే.
ఉదాహరణకు 1933-37 మధ్య ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్మిన ఇటలీ ముసోలినీ - జర్మనీ హిట్లర్లను, 1980 దశకంలో అదే మార్గాన పయనించిన అమెరికా రీగన్‌ను ''వస్తూత్పత్తి - ప్రజా పంపిణీ - సేవల కల్పన - ప్రజావాణిజ్యం ప్రభుత్వ బాధ్యత కాదనీ నినదించిన మార్గరెట్ థాచర్‌ను ఆదర్శంగా తీసుకుని థాచర్ నినా దాన్నే నేడు పునర్నినదిస్తున్నారు. మోడీ! పోనీ అవైనా విజయవంతమైన విధానాలా అంటే, ఆనాడే పూర్తి ఫెయిల్యూర్ విధానాలవి. వాళ్ళను భయంకర అణిచివేతల, తిరోగమన నేతలుగా గుర్తించారు ప్రజలు. అందుకే సదరు నేతల్ని చరిత్ర చెత్తబుట్టలో కలిపారు. నాటి విఫల విధానాలను - ఈనాడు మోడీ ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుని, దేశాన్ని వెనక్కు నెట్టేయటం, రాజనీతిజ్ఞతో, రాజకీయ మూర్ఖత్వమో బీజేపీ, ఆరెస్సెస్‌లు ఆత్మవిమర్శ చేసుకోవాలి! ఇక మన వంటి వ్యవసాయాధారిత చైనా, మనం అందుకోలేనంత ఎత్తుకు ఎలా ఎదిగింది. డెంగ్ సియోవోపింగ్ నాయకత్వాన ఐదేండ్లపాటు బడ్జెట్లో 90శాతం నిధులను వ్యవసాయాభివృద్ధికి కేటాయించి, దానిపై ఆధారపడిన 60శాతం మంది ప్రజల కొనుగోలు శక్తిని పెంచుకున్నారు. తత్కారణంగా దేశ దేశాల పారిశ్రామి వేత్తలు చైనాలో కుప్పలు తెప్పలుగా పరిశ్రమలను నెలకొల్పారు. కోట్లాది మందికి ఉద్యోగాలొచ్చాయి. కార్మికులకు ఉపాధి లభించింది. దాంతో చదువుకునే వాళ్ళ సంఖ్య పెరిగింది. నిరుద్యోగులను, సబ్సిడీలతో తక్కువ వడ్డీతో బ్యాంకు రుణాలిప్పించి, కుటీల పరిశ్రమల దిశగా విస్తృతంగా ప్రోత్సహించింది. అదువల్ల ప్రపంచ దేశాలకు అతి తక్కువ ధరలకే తన ఉత్పత్తులను ఎగుమతి చేయగలుగుతున్నది. అందుకే నానాటికి బహు ముఖంగా పురోగమిస్తూ అమెరికాను సవాలు చేసే స్థాయి కెదిగింది చైనా! చైనా ఈ ప్రగతి విధానాన్ని ఎవరోకాదు మన వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ స్వామినాధన్ వివరించారు. చైనా అనుసరించిన ఈ విధానాన్ని అనుసరిస్తూ, ఎంతో వెనకబడివున్న తెలంగాణ రాష్ట్రాన్ని కేవలం ఎనిమి దేండ్లలో అత్యధిక ఆదాయాన్నందించే నాల్గవ రాష్ట్రంగా అత్యధికంగా వరి పండిస్తున్న భారతైక రాష్ట్రంగా ప్రకటించారు ముఖ్య మంత్రి కేసీఆర్! 'రాజనీతిజ్ఞత' అంటే అదికదా మోడీజీ! అందుకే ప్రజలను కొను గోలుశక్తిని పెంచ కుండా, అంబానీ, అదానీలను ఆకాశమం తెత్తుకు ఎక్కదీసినా దేశంలో తిరోగమిస్తుందే గానీ, పురోగమించదన్న సత్యానికి మీ తొమ్మిదేండ్లపాలనే నిదర్శనం కదా మోడీజీ!
తమ ప్రయివేటీకరణ, కార్పొరేటీకరణ విధానాల ద్వారా కోట్లాది పేదలు, నిరుపేదలుగా మారుతున్నారని బీజేపీకి తెలుసు. పేదలు అన్ని కులమతాలలో ఉన్నది వాస్తవం. కుల, మతా తీతంగా పేదలంతా సమైక్యమైతే, తాము అధికారంలోకి రావటం కష్టమన్న సంగతీ అర్థమైంది. అందుకే నాడు విభజించి పాలించిన బ్రిటిష్ పాలకుల ఎత్తుగడనే బీజేపీ పాలకులు మరింత దూకుడుగా పాటిస్తున్నారు. అందుకు 'మత విద్వేషాన్ని' ఆయుధంగా మలుచు కున్నారు బీజేపీ పాలకులు! మత విద్వేషానికి సులభంగా లోనవు తున్నారు ప్రజలు. పామరులేకాదు, పండితులు, విద్యావంతుల్లోనూ చాలామంది ఈ మత విద్వేషానికి లోనుకావటం బాధాకారం.ఇదే బీజేపీకి అందివచ్చిన అవకాశం. బహుశా అందుకేనేమో 'మతం మత్తుమందు' అన్నారు కారల్‌మార్క్స్! ఈ వాస్తవాన్ని గ్రహించిన బీజేపీ. మెజారిటీ హిందువులున్న గుజరాత్, యూపీ వంటి రాష్ట్రాలలో 'గోమాంస భక్షకుల'న్న నెపంతో మైనారిటీ ముస్లిం ద్వేషాన్ని రగిల్చి, వాళ్ళపై దాడులకు ప్రోత్సహిస్తూ మెజారిటీ హిందుఓటర్లను సమీకరించుకుంటున్నది. మెజారిటీ హిందువులున్న అస్సాం, హర్యానా, ఛత్తీస్‌ఘడ్ మొదలైన రాష్ట్రాల్లో 'బలవంతపు మతమార్పిడులు' చేస్తున్నా రన్న నెపంతో మైనారిటీ క్రైస్తవ ద్వేషాన్ని రగిల్చి, వాళ్ళ ఇళ్ళు, చర్చీలపై దాడులకు ప్రోత్సహించుట ద్వారా మెజారిటీ హిందూ ఓటర్ల నాకర్షిస్తున్నది. మెజారిటీ క్రైస్తవ ఓటర్లున్న ఈశాన్య రాష్ట్రాలలో మాత్రం 'బీఫ్ తినటం జనజీవన శైలి అనీ, బీఫ్‌ను బీజేపీ వ్యతిరేకించదనీ జెరూసలేం యాత్రకు ఆర్థిక సహాయాన్నందిస్తామనీ, వగైరా ప్రోత్సాహకాల ద్వారా క్రైస్తవ ఓటర్లను ఆకర్షించేందుకు యత్నిస్తున్నది. క్రైస్తవులు, ముస్లింలు కేరళ వంటి రాష్ట్రాలలో 'లవ్ జిహాదీల'న్న నెపంతో మైనారిటీ ముస్లిం ద్వేషాన్ని రగిల్చి, మెజారిటీ క్రైస్తవులను ఆకట్టుకునేందుకు చూస్తున్నది. బీజేపీ! ఇలా మైనారిటీ ముస్లిం క్రైస్తవ ద్వేషాన్ని రగుల్చుతూ వాళ్ళపై దాడులు చేయిస్తూ ప్రపంచ వ్యాప్తంగా భారతదేశానికి బోలెడు అపఖ్యాతిని పోగేసి పెడుతున్నది మోడీ ప్రభుత్వం! అయినా హిందువుల అభివృద్ధికి హిందూ మత ఔన్నత్యం కోసం ఏమైనా చేస్తుందా అంటే, అదేమీలేదు. ఎందుకంటే? కేవలం మత విద్వేషాన్ని రగిల్చినందుకే హిందూ ఓటర్లు తమవైపు మొగ్గుతున్నారు గనుక, సదరు విద్వేష జ్వాలల్ని చల్లారకుండా చూచుకుంటే చాలు. ఇంకా హిందువుల ప్రగతి కోసం అదనంగా శ్రమించాల్సిన అవసరం ఏముందని అనుకుంటున్నది బీజేపీ! దేశాన్ని హిందుత్వ రాష్ట్రం కోసం నియంతృత్వ విధానాలను అనుసరిస్తున్న మోడీ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.
- పాతూరి వెంకటేశ్వరరావు
9849081889