Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • కామారెడ్డిలో కరోనా కలకలం
  • ఢిల్లీలో కొత్తగా 17,282 కరోనా కేసులు
  • తొలి వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్
  • రాజస్థాన్‌లోనూ రాత్రిపూట కర్ఫ్యూ
  • సన్‌రైజర్స్‌ లక్ష్యం 150
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
భారత ప్రజాస్వామ్యం బతుకు పోరాటం చేయాలి | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి

భారత ప్రజాస్వామ్యం బతుకు పోరాటం చేయాలి

Tue 02 Mar 04:09:18.588786 2021

రాజ్యాంగం కల్పించిన భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసే ప్రాథమిక హక్కును, ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక క్రమపద్ధతిలో నిరాకరిస్తూ వస్తోంది. 2014లో ఆయన అధికారం చేపట్టిన తరువాత ఆ సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్‌ లేని స్వేచ్ఛాయుత భారతదేశమే ('కాంగ్రెస్‌ ముక్త భారత్‌') లక్ష్యమని నరేంద్ర మోడీ ప్రకటించినప్పుడే, జవహర్‌ లాల్‌ నెహ్రూ వారసత్వాన్ని తుడిచివేసి, ప్రతిపక్షం లేని ఒక నిరంకుశ పాలనను ఏర్పాటు చేయాలనే ఆలోచన ఆయన మనసులో ఉన్నది.
2016, మార్చి 5వ తేదీన నాటి బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా 'మనం భరతమాతను విశ్వగురువు (ప్రపంచ గురువు) స్థాయికి ఎత్తాలంటే, భారతదేశంలో బీజేపీ 25 సంవత్సరాల పాటు అధికారంలో ఉండడం ముఖ్యం' అని అన్నాడు. ఇది, విశ్వగురువు అత్యవసర డిమాండ్‌కు గల బలమైన కారణాన్ని తెలియజేస్తుంది. అంటే, ఇది భారతదేశంలో రాజకీయ ప్రతిపక్షం లేకుండా నిర్మూలించడం, అసమ్మతిని తెలిపే వారిని అణచివేయడం, లౌకికవాదాన్ని లేకుండా చేయడం లాంటి ఒక దీర్ఘకాలిక రాజకీయ కార్యక్రమాన్ని సంక్షిప్తంగా వ్యక్తం చేస్తున్నది.
ఒక యోగిని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా నియమించి నప్పుడు, పరిస్థితులు చాలా ఘోరంగా మారాయి. గోవధపైన నిషేధం విధించిన తరువాత, వెంటనే 'లవ్‌ జీహాద్‌' పేరుతో మతాంతర వివాహాలకు వ్యతిరేక ప్రచారం ప్రారంభమయింది. భిన్నాభిప్రాయాలను అణచివేసేందుకు అవలంబించిన అత్యంత భయంకరమైన పద్ధతి ఏమంటే, దేశద్రోహం నేరం కింద శిక్షించే విధానం. ఈ నేరారోపణ, భారతదేశంలో బ్రిటీష్‌ వారి పాలనా కాలంలోనే స్వాతంత్య్రోద్యమాన్ని అణచివేసేందుకు చాలా విస్తతంగా దుర్వినియోగం చేయడం జరిగింది. అది పుట్టిన దేశం, బ్రిటనే దానిని రద్దు చేసింది. కానీ భారతదేశంలో, హిందూత్వ వాదాన్ని సమర్థిస్తున్న వారే దానిని ఒక పద్ధతి ప్రకారం అమలు చేస్తున్నారు. ఫిబ్రవరి 13వ తేదీన, దిశా రవి అని ఒక పర్యావరణ కార్యకర్తను బెంగళూరులో పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఉత్తర భారతదేశంలోని హర్యానా రాష్ట్రానికి చెందిన హోంమంత్రి, అనీల్‌ విజ్‌, ఫిబ్రవరి 15వ తేదీన 'మనసులో దేశ వ్యతిరేకభావాలు ఉన్నవారిని నిర్మూలించాలని' ప్రకటించాడు. ఈ పర్యావరణ మహిళా కార్యకర్తను ఢిల్లీకి చెందిన ప్రత్యేక పోలీస్‌ విభాగం అధికారులు, రైతుల నిరస నోద్యమానికి సంబంధించి ప్రముఖ ప్రపంచ పర్యావరణ కార్యకర్త గ్రేటా థన్‌ బర్గ్‌ ట్వీట్‌ చేసిన 'టూల్‌ కిట్‌'తో సంబంధాలు ఉన్నాయని అరెస్ట్‌ చేశారు. ఇదిలా ఉంటే, సంఫ్‌ుపరివార్‌ శక్తులు మాత్రం ఎప్పుడూ 'విదేశీ కుట్రల' గురించి మాట్లాడుతున్నాయి. మోడీ పాలిస్తున్న భారతదేశంలో భిన్నాభిప్రాయాల వ్యక్తీకరణ హక్కు, అసమానమైన పోరాటాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ముఖ్యంగా ఎన్నికలలో విజయం సాధించిన తరువాత కూడా, ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచార సభలలో పాల్గొనడం ఆపు చేయలేదు. రాజకీయ ప్రత్యర్ధులతో బహిరంగంగా చర్చకు దిగకుండా, వారిలో దేశభక్తి లోపించిందని బహిరంగంగా నిందించడం ఆయన నేర్పైన పని పద్ధతి. ఇది రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు(ఆరెస్సెస్‌) ప్రామాణికంగా అవలంభించిన సరళమైన పని విధానం కూడా. కానీ ఇది ఫాసిస్టు దోరణికి చిహ్నంగా కూడా గుర్తించబడింది. రాజకీయ ప్రత్యర్ధులు ఎన్నికల్లో ఓటమి చెందడంతో, వారి అడ్డు లేకుండా చేయాలనే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు.
ప్రజాస్వామ్యం, భావవ్యక్తీకరణ స్వేచ్ఛపై ఆధారపడి ఉంటుంది. అంటే భిన్నాభిప్రాయాల వ్యక్తీకరణను, అసమ్మతిని అంగీకరించడం. ప్రతీ ప్రభుత్వం అంగీకరించిన ప్రాథమిక నియమాల విషయంలో గానీ, లేదా జాతీయ భావజాలానికి సంబంధించిన నియమాల విషయంలో గానీ జాతీయంగా అధిక సంఖ్యాకుల అభిప్రాయాలపైన ఆధారపడుతుంది. ప్రతీ ప్రజాస్వామిక ప్రభుత్వం ప్రజలందరి అంగీకారంపైనే ఆధారపడి ఉంటుంది. పార్లమెంట్‌లో మెజారిటీ సాధించిన ప్రభుత్వం, ఆ మెజారిటీ భావజాలాన్ని మొత్తం దేశ ప్రజల అభిప్రాయాలుగా గుర్తించినప్పుడు ఒక భయంకరమైన సంక్షోభం తలెత్తుతుంది.
ఈ తాత్కాలిక మెజారిటీ ఉన్న ప్రభుత్వం, జాతి మొత్తానికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు చెప్పుకుంటుంది. అంటే ఆ మెజారిటీ ఉన్న ప్రభుత్వం మాత్రమే జాతికి ప్రాతినిధ్యం వహించేదిగా, ఉనికిలో ఉండే హక్కున్న ప్రతిపక్షం యొక్క వారసత్వాన్ని నిరాకరిస్తున్నట్టు చెప్పుకుంటుంది.
చాలా మంది ఈ ప్రమాదాన్ని గుర్తించడంలో విఫలమవుతున్నారు. హిందు వులు మాత్రమే ఈ జాతిని నిర్మిస్తే, జాతిని పాలిం చడంలో ఒక్క మాట కూడా మాట్లాడే రాజకీయ హక్కు, మైనారిటీలు కలిగి ఉండరనేది స్పష్టమవుతుంది. మార్చి 10, 2000 నాడు ఆరెస్సెస్‌ చీఫ్‌గా నియమించబడిన సుదర్శన్‌ అదేరోజు 'ఈ హైందవేతరులు విదేశీయులు కాదు, కానీ మాజీ హిందు వులు; వారు భారతీయులే కానీ, వారి విశ్వాసాలు 'హైందవీకరించబడాలని' అన్నాడు. మళ్ళీ మార్చి 23వ తేదీన ఢిల్లీలో కూడా ఇదే విధంగా హితబోధ చేశాడు. అంటే 'ఘర్‌ వాపసీ' ద్వారా వీరంతా హిందూ మత విశ్వాసకులుగా మారాలి అని అర్థం.
ఒక సమయంలో విశ్వహిందూ పరిషత్‌ పూర్వ అధ్యక్షుడు ప్రవీణ్‌ తొగాడియా 'ప్రపంచమంతా హిందూ మతమే. ఒకప్పుడు 700 కోట్ల మంది ఉన్న హిందువులు, ప్రస్తుతం 100 కోట్ల మంది మాత్రమే ఉన్నారని, మన దేశంలో 82 శాతం మంది హిందువులు ఉన్నారని, మనం హిందువులలో స్పహ కల్గించకుంటే కొన్ని దశాబ్దాల కాలంలో ఆ సంఖ్య 46 శాతానికి తగ్గిపోతుందని' అన్నాడు.
నరేంద్ర మోడీ అధికారంలోకి రావడంతో, పరిశోధనా గ్రంథాలలోని నెహ్రూ ఆలోచనల స్థానాన్ని, గోల్వాల్కర్‌ ఆలోచనలతో భర్తీ చేస్తున్నారు. ఆరెస్సెస్‌, భారతదేశ గత చరిత్రపై యుద్ధం చేస్తుంది. అది బౌద్ధ మతానికి చెందిన అశోకుడిని, ముస్లిం చక్రవర్తి అయిన అక్బర్‌ను, హిందువు అయిన జవహర్‌లాల్‌ నెహ్రూను చులకన భావంతో చూస్తూ, శతాబ్దాల కాలంలో సాధించిన విజయాలను, తన ఇరుకైన, విభజన భావజాలంతో తుడిచి పెడుతుంది.''సంఫ్‌ు నా ఆత్మ' అని ప్రకటించిన అటల్‌ బిహారీ వాజపేయి ఒక ఆరెస్సెస్‌ కార్యకర్త. కానీ ఆయన, ఆరెస్సెస్‌ కలవరపాటుకు గురయ్యే విధంగా జవహర్‌లాల్‌ నెహ్రూను ప్రశంసించాడు. కానీ వాజ్‌పారుకి పూర్తి భిన్నంగా, తన చిన్న తనం నుంచి ఆరెస్సెస్‌ ప్రచారక్‌గా పని చేసిన నరేంద్ర మోడీ మాత్రం నెహ్రూను ద్వేషిస్తున్నాడు. 2018వ సంవత్సరం చివరి నాటికి, మోడీ ప్రభుత్వం ఆరెస్సెస్‌కు అనుకూలంగా ఉన్న వారిని అవకాశం ఉన్న ప్రతీచోటా వివిధ స్థానాల్లో భర్తీ చేసింది. నెహ్రూ ఆదర్శాలను, జ్ఞాపకాలను కాపాడుతున్న జవహర్‌ లాల్‌ నెహ్రూ యూనివర్సిటీని తన ప్రధానమైన లక్ష్యంగా పెట్టుకుంది.
గుజరాత్‌ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా గానీ, భారతదేశ ప్రధానమంత్రిగా గానీ బాధ్యతలు చేపట్టిన వెంటనే తన నిరంకుశ వైఖరిని, హిందూత్వ మనస్తత్వాన్ని, అధికార ఆధిపత్య వైఖరిని ప్రదర్శించడంలో మోడీ ఏ మాత్రం సమయం వధా చేయలేదు. ఆయన ప్రధానమంత్రి అయిన ఈ ఏడేండ్ల కాలంలో ఒక్క పత్రికా సమావేశాన్ని(ప్రెస్‌ కాన్ఫరెన్స్‌) కూడా నిర్వహించలేదు.
అసలు కేబినెట్‌ వ్యవస్థ అనేదే ఉనికిలో లేకుండా పోయింది. మోడీని పొగడ్తలతో ముంచెత్తకుండా ఏ మంత్రీ ప్రభుత్వ విధానాల గురించి మాట్లాడరు. ఫాసిస్ట్‌ ఆలోచనల ప్రకారం వ్యక్తి పూజను ప్రోత్సహిస్తున్నారు. మెజారిటీ ఎలక్ట్రానిక్‌ మీడియా ఆయనను గుడ్డిగా సమర్థిస్తున్నది.
ఇటువంటి వాతావరణంలో భిన్నాభిప్రాయాల వ్యక్తీకరణ హక్కు, అసమానమైన పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. భారత ప్రజాస్వామ్యం తన బ్రతుకు కోసం జీవన పోరాటం చేయాల్సి ఉంటుంది. ప్రతిపక్ష పార్టీలన్నీ ఐక్యం అయ్యేందుకు నిరాకరిస్తూ, అసమ్మతిలోనే ఆనందాన్ని పొందుతుండడం విచారకరం.

- ఏ.జీ. నూరానీ
(వ్యాసకర్త ప్రముఖ న్యాయవాది),

అనువాదం-8 (28.02.2021)
బోడపట్ల రవీందర్‌, వైరా,ఖమ్మం జిల్లా.
సెల్‌: 9848412451

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అమెరికా నౌక - అక్రమ చొరబాటు
కోవిడ్‌ విజృంభిస్తోంది.. ప్రభుత్వం ఏంచేస్తోంది..?
వి'ప్లవ' నామ సంవత్సరం
రాజ్యాంగ రక్షణే అంబేద్కర్‌కు నివాళి
ఆయన అమరత్వం చిరకాలం...
ప్రధాని పాఠాల ప్రయోజనమేమిటి?
పాలక వర్గాలు - పేదలపట్ల శ్రద్ధ
లాల్‌ సలామ్‌!
ఐదు మూసుడు పది అమ్ముడు
చిరకాల స్పూర్తి....... మన బొజ్జి !!
పంచతంత్రంలో పారని మోడీమంత్రం!
క్రాంత దర్శి
తారా లోకం!
పాఠశాల విద్యలో వినూత్న పథకం ఎలా ఉండాలి..?
న్యాయవ్యవస్థే చట్టాన్ని ధిక్కరిస్తే...?
భాయీ భాయీ..
మన పురాణ పాత్రల మూలాలు ఈజిప్టులో ఉన్నాయా?
ఆన్‌లైన్‌ విద్యతో విద్యార్థులకు ఒరిగేదెంత?
ఉచిత వరాలతో అభివృద్ధి సాధ్యమా?
ప్రతిభ-అసమర్థత-రిజర్వేషన్లు
తమిళ అస్తిత్వంలో మార్పు..!
ఫూలే, అంబేద్కర్‌లు కులనాయకులా?
కాగ్‌ పట్టి చూపిన ఆర్థిక నిర్వాకపు మెతుకు
స్వీయహత్యల దోషులెవరు?
సుఖాంతమైన సూయజ్‌ ఓడ కథ..
ఐఎంఎఫ్‌ నిజ స్వరూపం
సార్వత్రిక ఆహార భద్రత కల్పించాలి
బత్తాయిలు... కరెంట్‌ షాక్‌
''ఉపా'' ఓ రాజ్యాంగ విరుద్ధమైన చట్టం
మధ్య తరగతిని చిత్తు చేసిన కరోనా మహమ్మారి
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.