Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అధికారంలో ఉన్న బీజేపీకి మాతృసంస్థ అయిన ఆరెస్సెస్ గురించి తరచుగా ప్రజాక్షేత్రంలో చర్చించబడుతూ ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఆ సంస్థ జాతీయోద్యమంలో ప్రధాన పాత్ర పోషించిందని నిరూపించడంకోసం వారనేక మంది ప్రయత్నిస్తున్నారు. ఆరెస్సెస్ భావజాలం కలవారిలో ముఖ్యుడైన ప్రస్తుత రాజ్యసభలో బీజేపీ ఎంపీగా ఉన్న రాకేష్ సిన్హా కూడా అదే పనిలో ఉన్నారు. సహాయ నిరాకరణోద్యమంలో ఆరెస్సెస్ వ్యవస్థాపకుడైన హెడ్గేవార్ పాల్గొనడం వల్లనే ఆ ఉద్యమం ఉత్తేజ భరితంగా నిర్వహింపబడిందని పేర్కొంటున్నాడు. ఇంకా అనేక వాదనలు కూడా వినిపిస్తున్నాయి. సాజినారాయణ్ లాంటి నాయకులు స్వాతంత్రోద్యమం ఉచ్ఛదశలో ఉన్నప్పుడు ఆరెస్సెస్ భాగస్వామిగా కొనసాగిందని చెపుతాడు. ఒకానొకప్పుడు ఆరెస్సెస్ ప్రచారక్‌గా ఉన్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయీ స్వాతంత్య్రోద్యమంలో తాను కూడా భాగస్వామిగా ఉన్నట్టుగా తానే చెప్పారని మనకు గుర్తు చేస్తారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సమయంలో, ఇలాంటి చర్చ మరొకసారి ముందుకు వచ్చింది. ఉద్దవ్ థాకరే మాట్లాడుతూ స్వాతంత్య్రోద్యమంలో ఆరెస్సెస్ ఏనాడూ పాల్గొన లేదని, అది కేవలం భారత్ మాతాకీజై అని జపించినంత మాత్రాన వారు దేశభక్తులు కాబోరనిచెప్పారు. ఆరెస్సెస్ సంస్థలో శిక్షణ పొందిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, థాకరే ప్రకటనకు సమాధానమిస్తూ, ఆరెస్సెస్ వ్యవస్థాపకుడైన డాక్టర్ కె బి హెడ్గేవార్ స్వాతంత్య్ర సమర యోధుడని తెల్పాడు.
ఈ విషయాన్ని లోతుగా పరిశీలించినట్లయితే హిందూ, ముస్లిం జాతీయ వాదులు భారత దేశ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన లేదని అర్థమవుతుంది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారత దేశ స్వాతంత్య్ర పోరాటం మహాత్మా గాంధీ నాయకత్వంలో, సమాజంలోని సమస్త ప్రజల సహకారంతో, భాషా, మత పరమైన అడ్డంకులను అధిగమించి, భారతదేశ అత్యధిక ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించింది. వారి వారి మతపరమైన జాతీయతలు ఎజెండాగా కలిగి యున్న మతపరమైన సమూహాలు, ఈ జాతీయోద్యమానికి దూరంగా ఉన్నాయి. వారిలో ప్రతి ఒక్కరూ ఇతరుల జాతీయ వాదాన్ని వ్యతిరేకించడం కోసం బ్రిటిష్ వారికి సహకరించాలని నిర్ణయించుకున్నారు.
జాతీయోద్యమంలో భాగస్వామ్యానికి సంబంధించి హిందూత్వ జాతీయవాదులకు అనేక మినహాయింపులున్నాయి. అనేక సందర్భాలలో వారు జాతీయోద్యమానికి దూరంగా ఉన్నారు. లేదా బ్రిటిష్ వారికి సహకరించారు. సావర్కర్ తన అండమాన్ రోజులకు ముందు బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. విడుదల కావడం కోసం ఎప్పుడైతే బ్రిటిష్ వారికి క్షమాపణ తెలిపాడో అప్పటి నుంచి తను ఎప్పుడూ కూడా బ్రిటిష్ వ్యతిరేక పోరాటంలో భాగస్వామి కాలేదు. దీనికి భిన్నంగా బ్రిటిష్ వారికి కావలసిన సైన్యాన్ని రిక్రూట్ చేస్తూ, బ్రిటిష్ యుద్ధ ప్రయత్నాలకు మద్దతు ఇచ్చాడు. ఈ కాలంలోనే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా, పోరాడడానికి సుభాష్ చంద్రబోస్ అజాద్ హిందు ఫౌజును స్థాపించాడు.
ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు హెగ్డేవార్ స్వాతంత్య్ర సమరయోధుడని ఫడ్నవీస్ అనడంలో పాక్షిక సత్యమే ఉన్నది. 1920లో నిర్వహించబడిన సహాయ నిరాకరణోద్యమంలో హెగ్డేవార్ పాల్గొనడమే కాక ఒక సంవత్సరకాలం జైలుశిక్ష అనుభవించాడు. 1925లో ఆర్ఎస్ఎస్ను స్థాపించిన తరువాత రెండు సందర్భాలలో మాత్రమే జాతీయ ఉద్యమంలో పాక్షికంగా భాగస్వామి అయ్యాడు. ఈ రెండు సందర్భాలలో, ఆయన హిందూ జాతీయవాదిగా భారత జాతీయ ఉద్యమంతో స్పష్టంగా విభేదించాడు.
శ్యామ్సల్ ఇస్లాం ''1929లో లాహౌర్ కాంగ్రెస్, జనవరి 26న మూడు రంగుల జెండాలను బహిరంగంగా ఎగురవేయాలని పిలుపునిచ్చింది. ఈపిలుపులో హెగ్డేవార్ భాగస్వామి అయినట్టుగా వారికి చెప్పబడింది. హెగ్డేవార్ తన నేతృత్వంలో ఆ పిలుపును అనుసరించకుండా తిరస్కరించాడు. దీనికి బదులుగా 21 జనవరి 1930న ఆరెస్సెస్ శాఖలన్నిటికి రాష్ట్రీయ ధ్వజ్ అనగా, భాగ్యధ్వజ్ జాతీయ జెండా అనగా, కాషాయ జెండాను పూజించవలసినదిగా ఆదేశాలు పంపాడని'' పేర్కొన్నాడు. కాబట్టి విధానపరంగా ఉన్న భిన్నాభిప్రాయం స్పష్టంగా ఉన్నప్పటికీ జనవరి 26న సంపూర్ణ స్వాతంత్య్ర దినోత్సవంగా నిర్వహించడానికి పాక్షిక సహకారాన్ని మాత్రమే అందించాడు. మూడు రంగుల జెండా ఎగురవేయాలనే జాతీయ పిలుపునకు బదులుగా, హిందూ జాతీయవాదం అనే పదానికి చిహ్నమైన కాషాయ జెండాలు ఎగురవేశారు.
డాక్టర్ హెడ్గేవార్ 1930లో సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగస్వామి కావడం వాస్తవమే. ఈ సంఘటన ఆరెస్సెస్‌ను ఒక సంస్థగా ఈ ఉద్యమానికి దూరంగా ఉండమని ఆదేశించినట్టు స్పష్టమవుతుంది. హెడ్గేవార్ తన వ్యక్తిగత హౌదాలో ఆ ఉద్యమంలో పాల్గొంటున్నానని తెలిపాడు. ఇందువల్ల తాను తన సర్ సంఫ్‌ుచాలక్ (సుప్రీం చీఫ్) పదవిని తన స్నేహితుడు, సహచరుడైన డాక్టర్ పరంజపికి తన బాధ్యతలను జైలులో ఉన్నంతవరకు అప్పగించానని చెప్పాడు. సి పి భిషికర్, హెగ్డేవార్ జీవిత చరిత్రలో తెలియజేసినట్టుగా సంఫ్‌ు ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనబోదని చెప్పినట్టుగా చెప్పాడు. బిషికర్ చెప్పిన ప్రకారం స్వేచ్ఛను కోరుకునే వారి, తమనుతాము త్యాగం చేసుకునేవారి, ప్రతిష్ట కలిగిన, పలుకుబడి కలిగిన కాంగ్రెసులో ఉన్న బందాలతో సంఘం గూర్చి చర్చించి, వారిని తన భావజాలం వైపు ఆకర్షించే లక్ష్యంతో హెగ్డేవార్ తిరిగి ఉద్యమంలో పాల్గొంటున్నానని చెప్పాడు. వారిని తన భావజాలానికి సంబంధించిన పనిలోకి మార్చడానికని చెప్పాడు.
బ్రిటిష్‌కు వ్యతిరేకంగా ఉధతంగా ఉద్యమం నడుస్తున్న సమయంలో కూడా ఆరెస్సెస్ బ్రిటిష్ ప్రభుత్వ ఆదేశాలను పాటించడం గమనిస్తాం. ఆర్ఎస్ఎస్ శాఖలను, తమ రోజువారీ పనిలో నిమగం అవ్వాలని, బ్రిటిష్ వారికి కోపం తెప్పించే ఏ కార్యక్రమాన్ని చేపట్టవద్దని ఆదేశించారు. గురూజీ సమగ్ర దర్శన్ (వాల్యూమ్ 4పేజ్39) ఈ విధంగా తెలియజేస్తాడు. ''దేశంలో క్షణక్షణం మారుతున్న పరిస్థితులను బట్టి మనసులో అశాంతి, అలజడి చెలరేగుతుంది. అలాంటి అశాంతి 1942లో ఉంది. దానికి ముందు 1930-31లో ఉద్యమం ఉంది. ఆ సమయంలో పలువురు డాక్టర్జీ(హెగ్డేవార్)వద్దకు వెళ్ళి కలిసారు. ఈ ఉద్యమం స్వాతంత్య్రానికి దారితీస్తుందని, సంఫ్‌ు ఈ విషయంలో వెనుక పడకూడదని బృందంగా వెళ్లినవారు డాక్టర్జీకి విన్నవించుకున్నారు. ఆ సమయంలో బృంద సభ్యుల్లో ఒకరు తాను జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తాడు.'' డాక్టర్జీ మాట్లాడుతూ తప్పనిసరిగా వెళ్ళమని జైలుకు వెళ్లే సమయంలో అతని కుటుంబ బాధ్యత ఎవరు స్వీకరిస్తారని అడిగాడు. ఆ పెద్దమనిషి సమాధానమిస్తూ తాను తన కుటుంబానికి తగినట్లుగా అవసరమైన వనరులను సమకూర్చానని, కేవలం కుటుంబ అవసరాలకే కాక, ఇతర అవసరాలకు అనుగుణంగా, అవసరమైతే జరిమానాలు చెల్లించడానికి కూడా వనరులను సమకూర్చానని చెప్తాడు. అప్పుడు డాక్టర్జీ మాట్లాడుతూ, అతను పూర్తి వనరులను తన కుటుంబానికి సమకూర్చినట్టయితే రెండు సంవత్సరాలు సంఫ్‌ు కొరకు పని చేయమని సలహా ఇచ్చాడు. ఆ పెద్దమనిషి తన ఇంటికి వెళ్ళిన తరువాత జైలుకు వెళ్లడం గాని, సంఫ్‌ు కొరకు పని చేయడానికి ముందుకు రావడం గానీ జరగలేదు.
ఇది మరొకసారి ఆర్ఎస్ఎస్ భావజాల మైన హిందూ జాతీయ వాద భావజాలానికి అనుగుణంగానే ఉంది. గోల్వాల్కర్ 'బంచ్ ఆఫ్ థాట్స్' గ్రంథంలో స్వాతంత్య్ర పోరాటాన్ని తీవ్రంగా విమర్శిస్తూ ''ప్రాంతీయ జాతీయవాదంగా'' పేర్కొన్నాడు. ఇది నిజమైన హిందూ దేశ నిర్మాణానికి అనుకూలమయిన, ఉత్తేజపూరితమైన హిందూ దేశాన్ని నిర్మించుకోవడంలో ఆటంకం అయింది. అనేక స్వాతంత్య్ర పోరాటాలను కాంగ్రెస్ నిర్వహించింది. వాస్తవంగా అవి బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమాలే. భారతదేశంలో హిందూ రాజ్యాన్ని నిర్మించడమనే భావజాల నిబద్ధతతో, ఆరెస్సెస్‌లో భాగస్వామిగా కాక, హెడ్గేవార్ కాంగ్రెస్ వాడిగా జైలుకు వెళ్ళాడు. ఆర్ఎస్ఎస్కు దూరంగా ఉంటూనే భారత జాతీయవాద లక్ష్యంతో ఉన్న స్వాతంత్ర పోరాటాన్ని వ్యతిరేకించాడు.
బ్రిటిష్ వారి ఆదేశాల మేరకు ఆరెస్సెస్‌కు మిలటరీ డ్రిల్, యూనిఫామ్ ఉండాలని గోల్వాల్కర్ ఆదేశించాడు. ''మనం చట్టం పరిధిలో మన పని చేసుకోవాలి'' అంటూ 1943 ఏప్రిల్ 29న ఒక సర్కులర్ జారీ చేశాడు. క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభించబడిన ఒకటిన్నర సంవత్సరముల తరువాత, బ్రిటిష్ రాజ్యంలోని బాంబే ప్రభుత్వం పొందుపరిచిన ఒక మెమోలో తగిన సంతృప్తిని వ్యక్తం చేస్తూ'' సంఫ్‌ు ఎంతో మెలుకువగా, జాగ్రత్తగా తనను తాను చట్టపరిధిలో ఇముడ్చుకుందని ప్రత్యేకంగా 1942 ఆగస్టులో సంభవించిన అల్లర్లకు దూరంగా ఉందని రిపోర్టులో తెలిపింది.
వాజపేయిది మరో కథ. 1998 ఎన్నికల సందర్భంలో తాను స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నట్లు ప్రకటన చేశారు. ఆ విషయాన్ని పరిశీలన చేసినప్పుడు, తన స్వస్థలమైన బటేశ్వర్‌లో ప్రదర్శనలు జరిగేటప్పుడు వాజపేయీ ఒక ప్రేక్షకుడు మాత్రమేనని తేలింది. పోలీసులు లాఠీచార్జి చేసే సమయంలో వాజపేయీ వారిని అనుసరించాడు. పోలీసులు ఉద్యమకారు లను నిర్బంధించారు. వాజ పేయీ చెప్పిన ప్రకారం అతను కూడా అరెస్టయ్యాడు. వెంటనే క్షమాపణ కోరుతూ ఉత్తరం రాశాడు. ఉద్యమకారులు చేస్తున్న ఉద్యమాన్ని వ్యతిరేకించటం, అదేవిధంగా ఉద్యమానికి నాయకత్వం వహించిన వారి పేర్లను కూడా ఆయన రాసివ్వడం జరిగింది. హిందూ రాష్ట్ర సాధనే ఆర్ఎస్ఎస్ లక్ష్యం. వారి ప్రస్తుత ప్రయత్నాలన్నీ భారత జాతీయ వాదం కోసం పనిచేసిన స్వాతంత్రోద్యమంలో భాగస్వాములమనే భావన కల్పించడం. ఇదంతా ఒక ఎన్నికల ప్రయోజనం కోసమే తప్ప, వాస్తవంగా సత్యదూరమైనది.
- రామ్ పునియాని
అనువాదం:మల్లెంపాటి వీరభద్రరావు,
సెల్: 9490300111