Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాట్సాఫ్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా సమాచారం క్షణాల్లో మన ముంగిట వాలిపోతున్నది. సమాచారం కావచ్చు... వీడియోలు కావచ్చు.. మేసేజె ఏదైనా కాదేది అనర్హం అన్నట్టు.. అది మంచిదో, చెడ్డతో, నష్టం కలిగించేదో తెలియకుండానే వెంటనే షేర్ చేస్తుంటాము. దానికి నేనేం అతీతం కాదు. ఇదే అదనుగా భావించి నేరగాళ్లు సైతం జోరబడుతున్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఆధార్ లింక్, ఓటీపీ నెంబర్లు కూడా ఎంతో చాకచక్యంగా అడిగి తెలుసుకుంటున్నారు. కొన్నిసార్లు అకౌంట్ల నుంచి డబ్బుపోయి లబోదిబోమన్నా... తిరిగిరావు. ఈ విషయంలో బ్యాంకులూ చేతులెత్తిస్తున్నాయి. ఇక ప్రయివేటు బ్యాంకుల్లోనైతే దగ్గరికి కూడా రానివ్వని పరిస్థితి ఉంటుంది. తాజాగా ఒక మేసేజ్ విపరీతంగా వైరల్ అవుతున్నది. అవునో, కాదో చూడకుండా ప్రపంచ వ్యాప్తంగా మొబైళ్లలో చక్కర్లు కొడుతున్నది. అదే అమెజాన్ లోగోతో ఉన్న మేసేజ్.. సదరు సంస్థ ఏర్పడి 30 ఏండ్లు అవుతున్న సందర్భంగా మేము అడిగిన నాలుగైదు సింపుల్ ప్రశ్నలకు సమాధానం చెప్పితే.. ఇంటికే ఫ్రీగిప్టులు పంపిస్తామనేది ఆ మేసేజ్ సారాంశం. ఇగ జూసుకో సామిరంగా...అమెరికా నుంచి ఆమన్గల్ దాకా, పట్టణం నుంచి పల్లె దాకా, ధనవంతుడి నుంచి పేద వరకు.. ఒక మాటలో చెప్పాలంటే మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ షేర్ చేశారు. ఉచిత బహుమతి కోసం ఎగబడుతున్నారు మన నెటిజన్లు. చివరికి ఆ సంస్థ ఇది ఫేక్ మేసేజ్.. తాము విడుదల చేయలేదన్నా... మన నెటిజన్లు మాట వినడం లేదని విమర్శకుల అభిప్రాయం.
- గుడిగ రఘు