Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'అందరూ శ్రీవైష్ణవులే..బుట్టలోని చేపలన్నీ మాయం' సామెత తీరుగా ఎన్నికల్లో డబ్బుల పంపిణీ అంశంపై రాజకీయ నాయకులు తెగ మాట్లాడేస్తున్నారు. ఎన్నికలు రాగానే అడ్డదారుల్లో నోట్లు పంచి గెలిచేసిన తర్వాత అబ్చే ఓటర్లు చెడిపోయారబ్బా.! సమాజం ఆగమైపోతుందబ్బా..!! ఇలాగైతే రాజకీయాలు చేయడం కష్టమబ్బా...!!! అన్నట్టుగా ఫోజులు కొట్టేస్తున్నారు. మొన్నటికి మొన్న పెద్ద చదువులు చదువుకున్నోళ్ల ఎన్నికల్లో ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎంలతో మూడో కంటికి తెల్వకుండా ప్రధాన పార్టీల అభ్యర్థులంతా గెలుపు కోసం పాకులాడుకుంటూ పైసలు పంచేసిండ్రు. ఇగ ఎన్నికలైపోగానే అందరూ శుద్ధపూసలోలే మాట్లాడటం వినటానికి ఓ పక్క కంపరంగా ఉంది. మరోపక్క గీళ్ల మాటల్లోని పరమార్ధాన్ని గ్రహంచి మనుషుల్లో చైతన్యం పెరిగితే...అందరూ మంచిగుండే సమ సమాజం దిశగా అడుగులు పడితే ఎంత బాగుండునో అని కూడా అనిపిస్తున్నది...
- ప్రశాంత్