Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వినేటోడు చెప్పేటోడికి లోకువ అన్న సామెత కమలంపువ్వోల్లకు సరిగ్గా సరిపోతుంది. చెడును సైతం అడ్డంగా సమర్థించుకోవడానికి ఎంతకైనా తెగిస్తారు. వారికి కావాల్సింది మూఢత్వం, మూఢవిశ్వాసాలు. సనాతన సంప్రదాయంలో మనుషులు బంధించబడి ఉండటమే. ఈ పరిస్థితులు ఇలాగే ఉంచడానికి సర్వశక్తులొడ్డుతున్నది. అనేక రూపాల్లో వాటిని మన మెదళ్లలోకి చొప్పిస్తున్నది. వాటిని ప్రశ్నించిన వ్యక్తులు, సంస్థలు, చివరాఖరున సినిమాపై కూడా దాడులకు తెగబడుతున్నది. భావ ప్రకటనాస్వేచ్ఛ అంటేనే వారికి చచ్చేంత భయం. బీజేపీ కనుసన్నల్లో పని చేస్తున్న యాంటీ టెర్రరిజం సంస్థ ఇటీవల ఒక వింత వాదనకు దిగింది. మావోయిస్టులను హీరోలుగా చూపించొద్దంటూ...చిరంజీవి నటించిన ఆచార్య, సినిమా, రానా, సాయిపల్లవి నటించిన విరాటపర్వం చిత్రాల విడుదలను అడ్డుకోవాలంటూ ఫిర్యాదు చేసింది. సమాజంపై సినిమాలు ఎంతో ప్రభావంగా పని చేస్తాయనేది తెలిసిందే. ప్రజల్లో చైతన్యం కలిగించే చిత్రాలు బహు అరుదు కాగా, సమాజాన్ని తిరోగమనం వైపుకు మళ్లించే చిత్రాలెన్నో వస్తున్నాయి. దెయ్యం, నాగదేవత, నాగమ్మ, భాగవతం, రామాయణం, భారతం వంటి చిత్రాలతోపాటు రోజూ పొద్దునే టీవీల్లో వచ్చే రాశిఫలాలు, ప్రవంచనాల పేరుతో ప్రజలను వంచన చేస్తున్న కార్యక్రమాలు ఆపేయాలని ఏనాడూ అనరు వీరు. ఇది వీరి కుసంస్కారానికి నిదర్శనం.
- గుడిగ రఘు