Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజకీయ పార్టీల తీరు జుగుప్సాకరంగా తయారైంది. ఒకవైపు కరోనా సెకెండ్‌వేవ్‌లో కేసులు అమాంతం పెరిగిపోతుంటే రాజకీయ పార్టీలు కిక్కిరిసిన జనాలతో సభలు, సమావేశాలు పెడుతూ పరిస్థితిని మరింత దిగజారుస్తున్నాయి. వైద్యారోగ్యశాఖ పదే పదే హెచ్చరికలు చేస్తున్నా... అవేమి పట్టనట్టు మాస్కులు పెట్టుకోకుండా, భౌతిక దూరం పాటించకుండా చేస్తున్న కార్యక్రమాలతో ఆందోళన నెలకొంటుంది. కరోనాకు రాజకీయ పార్టీలు ఏమైనా మినహాయింపా అని నెటిజన్లు సెటైర్లు గుప్పిస్తున్నారు. కరోనా కట్టడి పేరుతో సామాన్యులకు సవాలక్ష ఆంక్షలు విధిస్తున్న ప్రభుత్వాలు అదే రాజకీయ పార్టీలను మాత్రం వదిలేస్తున్నాయి. ఇప్పటికే పబ్బులు, బార్లకు అనుమతించి స్కూళ్లను మూసివేయడంపై విమర్శలు వస్తుండగా, తాజాగా వరుస ఎన్నికల నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ప్రచారం నిర్వహిస్తున్న పార్టీల తీరుపై మేధావుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతున్నది. చివరకు కోర్టులు జోక్యం చేసుకుని అదుపు చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన పరిస్థితి తలెత్తిందంటే ఓట్ల మీద ఉన్న యావ ప్రజల ప్రాణాల మీద లేదని సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. కరోనా మొదటి వేవ్‌లో ఇదే పరిస్థితి. సెకెండ్ వేవ్ వచ్చినా మార్పులేదు. ఎప్పటికి మార్పు వస్తుందో...
- కె.ప్రియకుమార్