Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనాదిగా స్టేజీల మీద అద్బుతంగా నటించిన మహనుభావులు ఉన్నారు. సినిమాల్లోనూ తమ నట విశ్వరూపాన్ని ప్రదర్శించి, ప్రజల మన్ననలు పొందిన మహనీయుల గురించి చెప్పుకుంటూనే ఉన్నాం. వందలాది మంది బుల్లితెర నటులు తమ ప్రతిభాపాట వాలు ప్రదర్శిస్తూ.. తమ నటనతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ఇలా నటీనటుల గురించి చెప్పుకోవడం సర్వసాధారణం. కరోనా సమయంలో చాలా మంది రాజకీయనాయకులు సైతం వారిని మించి తమ నట విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నారు. సినిమా నటులను పరోక్షంగా చూస్తాం. కానీ రాజకీయ నటసార్వభౌముల నటనను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. కరోనాకు ఎవరూ అతీతం కాదు. చివరకు ఆ దేవుల్లే ఏమీ చేయలేక పారిపోతున్నారు. గుడులు, మసీదులు, చర్చీలు మూతపడుతున్నాయి. ప్రతి ఒక్కరు డాక్టర్ వద్దకు పరుగులు పెడుతూనే ఉన్నారు. రాజకీయ నాయకులు డాక్టర్ల వద్దకు వెళ్లి చికిత్స చేయించుకుంటున్నారు. కానీ అత్యుత్సాహంతులైన కొంత మంది మాత్రం తమ నాయకుడు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలంటూ దేవుళ్లను ఆశ్రయిస్తున్నారు. పాలాభిషేకాలు, పూజలు, వ్రతాలు, యాగాలు, దర్గాల్లో ప్రార్థనలు చేస్తున్నారు. కరోనాకు విరుగుడు శాస్త్రీయమైన వైద్యమేనని శరణ్యమని మొత్తుకుంటున్నా...అధినాయకుల మెప్పుపొందేందుకు తమలో ఉన్న నటనా పటిమను మేల్కోల్పుతున్నారు. ఇలాంటి నాయకుల అద్భుత నటనకుగానూ వారిని నట కిరీటీలు అని సంభోదించకుండా ఉండలేకపో తున్నారు జనం.
- గుడిగ రఘు