Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏం కరోనానో ఏమో! కళ్లద్దాలోళ్లకు కష్టాలొచ్చి పడ్డాయి. ఇంటి నుంచి టూవీలర్‌పై ఆఫీస్‌కు రావాలంటే యుద్ధానికి సిద్ధమవుతున్న సరిహద్దు సైనికుడి లెక్క తయారవ్వాల్సి వస్తుంది. చేతులకు శానిటైజర్ రాసుకొని, మూతీ, ముక్కుకి డబుల్ మాస్కులు తగిలించుకొని, కండ్లద్దాలు పెట్టుకొని, బండి దగ్గరికొచ్చి నెత్తిన హెల్మెట్ పెట్టుకొని, మెడకు బెల్ట్ బిగించి, ముందున్న గ్లాస్ వేసుకొని బండెక్కితే, సరిహద్దుల్లో యుద్ధానికి బయల్దేరిన ఫీలింగే.. ఎగశ్వాస, దిగశ్వాసతో లోపల ఊపిరాడితే ఒట్టు. ఈ శ్వాస పైకి ఎగదన్ని, కండ్లద్దాలకు ఆవిరి కమ్మినట్టు కాగానే ఊపిరి వదలితే రోడ్డు కనపడదేమో అని బిగపట్టుకొని భయం భయంగా డ్రైవింగ్. అదేదో పద్మవ్యూహంలో లాగా గుడ్డిగా ముందుకెళ్లి, అందాజ్‌గా ఆఫీసులకు చేరుతున్నట్టే ఉంది. హెల్మెట్టు, దానికి ముందు గ్లాసు ఉన్నాయి కదా అని మూతికి మాస్కు కట్టుకోకపోతే... మెట్రో పిల్లర్ల సాటుకు దొంగల్లెక్క నిలబడి ఫోటోలు తీస్తున్న పోలీసోళ్లు ఇంటికేడ వెయ్యి రూపాయల చలానా పంపుతారో అని పరేషాన్. కండ్లద్దాలు తీస్తే రోడ్డు కనపడిచావదు... మూతికి మాస్కు లేకపోతే కరోనా వైరస్ బతకనివ్వదు. హెల్మెట్ లేకున్నా, దానికున్న బెల్ట్ పెట్టుకోకున్నా పోలీసోళ్లు చలానాలు వెయ్యక మానరు. ఏం బతుకురా అయ్యా... ఛస్...దీనికంటే సరిహద్దుల్లో యుద్ధమే సుఖం!
-ఎస్ఎస్ఆర్ శాస్త్రి