Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పదవి కోసం వేల మందిని చంపించి, లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తులను ఆహుతిచేసి, గురువులను, సంఫ్‌ు రాజకీయ ఉన్నతికి, తన రాజకీయ మనుగ డకే కారణమైన సంఫ్‌ు భీష్ములనే తొక్కినవారు పదవిని వదులుతారా? నల్ల సాగు చట్టాలకు వ్యతిరేకంగా 9నెలల నుంచి ఉద్యమిస్తున్న రైతాంగం ఈ డిమాండును ముందుకు తేవాలని, మోడీ రాజీనామా డిమాండుతో అంతర్యుద్ధం రావాలని ఒక నిజమైన దేశభక్తుని కోరిక. మోడీని దింపడా నికి ఇది మంచి సమయం. మూడేండ్ల ఎన్నికల దాకా ఆగితే ఆయన అంబులపొది నుంచి కొత్త అస్త్రాలు బయటికి వస్తాయి.
భారతంలో కోవిడ్ రోగుల భౌతికబాధలు, మానసికగాయాలు, గందరగోళం, మృతుల అవమానాలు వర్ణనాతీతం. మోడీ ప్రభుత్వం కరోనా నియంత్రణకు ప్రయత్నించడం లేదు. కోవిడ్ మారణహౌమం, వ్యవస్థల విచ్ఛిత్తి, స్పష్టంగా కనిపిస్తున్నా వైఫల్య కారణాలు కప్పి పుచ్చుతోంది. కరోనా వార్తలపై నిఘా పెట్టమని ట్విట్టర్‌ను కోరింది. కానీ అంతర్జాతీయ పత్రికలు నిజాలు బయటపెడుతున్నాయి.
పాత దాని కంటే కొత్త కోవిడ్ 3 రెట్లు ఎక్కువ తీవ్రంగా ఉంది. ప్రకటించినవాటి కంటే మరణాలు 10 రెట్లు ఎక్కువ. ఆస్పత్రుల చావులు మాత్రమే నమోదవుతాయి. గ్రామీణప్రాంతాల్లో, ఇండ్లలో, ఇతర ప్రదేశాల్లో జరిగిన మరణాలు నమోదుకావు. నమోదైన చాలా మరణాల్లో మరణ కారణం చూపరు. మన మొదటి కోవిడ్ అనుభవాలను, విదేశాలు తీసుకుంటున్న ద్వితీయ తరంగ జాగ్రత్తలను మనం పట్టించు కోలేదు. ప్రథమ తరంగ విశ్వమారిలో ఆక్సిజన్ అవసరం 41శాతం. ద్వితీయంలో 54.5శాతం. గతేడాది ఆక్సిజన్ ఎగుమతులను 4,502 టన్నులకు పెంచాం. అందుకే రూ.150ల ఆక్సిజన్ సిలిండర్ రూ.6 వేలు పలుకుతోంది. లక్నోలో 46 లీటర్ల సిలిండర్ రూ.45 వేలు. పట్నాలో రూ.2 వేల రెమిడెసివర్ సూదిమందు నల్లబజార్లో రూ.లక్షకు అమ్ముతున్నారు. ఏప్రిల్ 25న సింగపూర్ మొదలైన దేశాల నుంచి 25 విమానాల్లో 300 టన్నుల కోవిడ్19 వైద్యసామాగ్రి ఢిల్లీ విమానాశ్రయంలో దిగింది. వాటిలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, సిలిండర్లు, రెమిడెసివర్ సూదిమందు ఉన్నాయి. కేంద్రం వీటికి ఖచ్చితమైన నిర్వహణ విధానాలు నిర్ణయించలేదు. మే 2న విధానాలు నిర్ణయించి విమానాశ్రయ అధికారుల నుంచి సామగ్రి తీసుకునే బాధ్యత భారత రెడ్ క్రాస్ సొసైటీకి అప్పజెప్పారు. అయితే సగం సామగ్రి మాయమైంది. రాష్ట్రాలకు పంపామని అధికారులు, మాకు చేరలేదని రాష్ట్రాలు వాదిస్తున్నాయి. లక్షల రోగులు మరణావస్థలోనున్న సమయంలో నైతిక హైందవ చక్రవర్తి పాలనలో ఈ పని? హవ్వ! అమెరికా, కెనడా దేశాలు, మోడీ ప్రభుత్వ సంస్థలపై నమ్మకంలేదని ప్రకటించి, తమ వైద్యసామాగ్రిని భారత రెడ్ క్రాస్ సొసైటీకే పంపాయి.
2017 ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ, పాలక పార్టీ శ్మశానాల కంటే కబరిస్తాన్లపై ఎక్కువ ఖర్చుపెట్టి ముస్లింలను దువ్వుతోందని ఎగతాళిచేశారు. కబరిస్తాన్ కడితే శ్మశానం కూడా నిర్మించాలన్నారు. కబరిస్తాన్లు, శ్మశానాలు జనాభా ప్రాతిపదికన నిర్మిస్తారు. అయితే నేటి కోవిడ్ మృతుల శవాలతో శ్మశానాలు కిక్కిరిసిపోయాయి. సంప్రదాయవ్యతిరేక అవమానకర పద్ధతుల్లో శవదహనాలు జరుగుతున్నాయి. ఈ అపఖ్యాతి అంతర్జాతీయ పత్రికలకెక్కింది. దీనికి మోడీ జవాబేమి? మరొక పక్క సంఘీయులు అశాస్త్రీయ నిషేధపద్ధతులు ప్రచారంచేస్తున్నారు. నటి కంగనారనౌత్ యోగాతో శరీర ఆక్సిజన్ స్థాయి పెంచుకోమని, చెట్లు పెంచమని (దప్పికగొన్నప్పుడు బావి తవ్వమని) ట్వీటారు. ఆమెకు 30లక్షల అనుచరులున్నారట. పాపం వాళ్ళ గతేమికావాలి? తాజాగా మూఢనమ్మకాలను ప్రచారంచేస్తూ జనాలను రెచ్చగొడుతున్నందుకు ట్విట్టర్ ఆమె ఖాతాను ఆపేసింది. మరో నటుడు, మోడీ భక్తుడు అక్షరు కుమార్ రోగనిరోధకశక్తికి చ్యవనప్రాశ్ తినమని ప్రచారంచేస్తున్నారు. ఈయన అనుచరులు చ్యవనప్రాశ్ తిని కోవిడ్ జాగ్రత్తలు పాటించకపోతే? డాబర్ కంపెనీ లాభపడుతుంది. కానీ జనాలకు కోవిడ్ ఇబ్బడిముబ్బడిగా అంటుతుంది. గతేడాది రాందేవ్ తన కొరొనిల్ మందు కోవిడ్‌ను వారంలో నయంచేస్తుందని, రోజుకు 10లక్షల పోట్లాలు అమ్ముడుబోతున్నాయని అన్నారు. దానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు.హెచ్.ఓ.) ధృవీకరణ పత్రం ఇచ్చిందని అబద్ద ప్రచారంచేశారు. ఈ విషయాన్ని డబ్ల్యు.హెచ్.ఓ. తిరస్క రించింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఖండించింది. మన దేహం అద్భుత ఆవాసం కాబట్టి కరోనా అందులో కాపురముంటుంది తప్ప అది మనలను చంపదని మరో మోడీ భక్త మేధావి జగ్గీ వాసుదేవ్ ఏప్రిల్ 2020న చెప్పారు.
ఉత్తరప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించిన 550 మంది ఉపాధ్యాయ సిబ్బంది కోవిడ్ సోకి చనిపోయారు. కర్నాటకలో 2 వేల కోవిడ్ రోగుల జాడ తెలియలేదని ఆ రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఆర్.అశోక అన్నారు. ఫిబ్రవరి నుంచి కోవిడ్ ఉధృతమవుతున్నా ప్రధాని పట్టించుకోలేదు. ఏప్రిల్ 20 దాకా నోరువిప్పలేదు. ఆ తర్వాతే యంత్రాంగం కదిలింది. అయితే జరగవలసిన నష్టం అప్పటికే జరిగింది. నమోదైన చావుల కంటే 5రెట్లు ఎక్కువ ఉంటాయని సామూహిక వైద్యనిపుణులు హేమంత్ షెవడే అన్నారు. మే ఒకటి నాటికి 140 కోట్ల జనాభాలో 1.9శాతం మందికే పూర్తి టీకాలు వేశారు. నిఘా కమిటీలుగా పనిచేయమని ఏప్రిల్ 20న యువకులను కోరారు మోడీ. తోటి ప్రజలు కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తున్నారా లేదా చూడ్డమే వీరి పని. ఈ బృందాల్లో సంఘీయులే ఉంటారని, ముస్లింలను, ఇతర అసమ్మతివాదులను హింసిస్తారని చెప్పనక్కరలేదు. కోవిడ్ అవసర వస్తువుల కొరత ఉందన్నవారిపై చర్యలు తీసుకోమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అధికారులను ఆదేశించారు. నిజం మాట్లాడేవారంతా జైళ్ళలో కుక్కబడతారన్న మాట. మధ్యప్రదేశ్ లో మంత్రులే ఆక్సిజన్ రవాణా టాంకర్లను అడ్డుకున్నారు.
''మోడీ సముచిత, అసమాన, విచిత్ర రాజకీయ జంతువు. ఆకర్షణీయ వ్యక్తిగత అసత్యకథనాల తప్పుడు పోలికల నాయకుడు. సమర్థనావాద భక్త అనుచరులు గల వ్యక్తి.'' అని అంతర్జాతీయ శాంతి కార్నెజి ధర్మనిధి దక్షిణాసియా కార్యక్రమాల నిర్దేశకుడు మిలన్ వైష్ణవ్ విశ్లేషించారు. మోడీ, షా, యోగి ఇక ఇంటికెళ్లాలని అందరూ మనసులో అనుకునే మాటను కోల్‌కతా ఆంగ్ల దినపత్రిక టెలిగ్రాఫ్ బయటికే రాసింది. ప్రజలు ఈ ఆక్రోశాన్ని నిజంచేశారు. పశ్చిమబెంగాల్లో మోడీ పప్పులుడకలేదు. అసమర్థ, అనైక్యతల ప్రతిపక్షాలు బీజేపీకి తమ స్థానాన్ని ఇచ్చాయి. కేరళ, తమిళనాడుల్లో ప్రజలు మోడీకి ప్రవేశమే కల్పించలేదు.
మోడీ రాజీనామా చేయాలి అన్న నినాదం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. బెంగాల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బీజేపీ కేంద్ర పూర్వ మంత్రి యశ్వంత్ సిన్హా మోడీ రాజీనామా చేయాలన్నారు. ''మీరు తప్పుకోండి. సంఫ్‌ు సమ్మతించిన మరో వ్యక్తికి బాధ్యత అప్పచెప్పండి.'' అని ప్రఖ్యాత సామాజిక రచయిత్రి అరుంధతి రారు మోడీకి లేఖ రాశారు. కానీ, పదవి కోసం వేల మందిని చంపించి, లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తులను ఆహుతిచేసి, గురువులను, సంఫ్‌ు రాజకీయ ఉన్నతికి, తన రాజకీయ మనుగడకే కారణ మైన సంఫ్‌ు భీష్ములనే తొక్కినవారు పదవిని వదులుతారా? నల్ల సాగు చట్టాలకు వ్యతిరేకంగా 9నెలల నుంచి ఉద్యమిస్తున్న రైతాంగం ఈ డిమాండును ముందుకు తేవాలని, మోడీ రాజీనామా డిమాండుతో అంతర్యుద్ధం రావాలని ఒక నిజమైన దేశభక్తుని కోరిక. మోడీని దింపడానికి ఇది మంచి సమయం. మూడేండ్ల ఎన్నికల దాకా ఆగితే ఆయన అంబులపొది నుంచి కొత్త అస్త్రాలు బయటికి వస్తాయి.
- సంగిరెడ్డి హనుమంత రెడ్డి
9490204545