Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశంలో కరోనా పరిస్థితులు కాస్తంత సక్కబడుతున్నారు అని అనుకుంటుండగానే మతోన్మాద సోషల్ మీడియా కాష్మోరా ముఠాలు మళ్ళీ లేస్తున్నాయి. ఉన్మాద ప్రచారమే లక్ష్యంగా జనంలోకి వదిలిన వాట్సాప్ గ్రూపుల్లో ఇప్పుడు చైనాపై విషం చిమ్ముతూ, మోడీ భజన, దేశభక్తిని ఉప్పొంగిస్తున్నారు. ప్రశ్నించే వారందరినీ దేశద్రోహులుగా ముద్రలు వేయడం మొదలు నెహ్రూ తాత ముత్తాతల చరిత్రలు, ఖాన్ల కాందాన్ అంటూ పరనింద, ఆత్మస్తుతితో వాట్సప్ యూనివర్సిటీని పరుగులు పెట్టిస్తున్నారు. కోవిడ్ నియంత్రణలో కోల్పోయిన పరువును అర్జెంటుగా రికవరీ చేసుకోవాలనే తలంపు ఆ పోస్టుల్లో కనిపిస్తున్నది. ఎక్కడెక్కడో జరిగిన సంఘటనలకు మతం రంగు పూయడం, కరోనా విస్తరణకు ప్రజలే కారణమనే ధోరణిని ప్రచారం చేస్తూ దిల్ ఖుష్ చేసుకుంటున్నారు. ఆ పోస్టులన్నింటిలో చివరకు మిగులుతున్నది గో మూత్రం...శుభం...శుభం అనే 'ఆవు కతే'! మోడీ కాబట్టే... ఈ దేశ ప్రజలు ఇంకా ప్రాణాలతో ఉన్నారనే ధోరణితో పోస్టుల్ని వండి వారుస్తూ, వెగటు పుట్టిస్తున్నారు. స్వామిభక్తి మంచిదే...మరీ స్వామివారి అరికాళ్లు నాలుకతో నాకి శుద్ధి చేసుకుని 'రక్ష రక్ష' అనుకోవడమే ఎబ్బెబ్బెబ్బె....!!
-ఎస్ఎస్ఆర్ శాస్త్రి