Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''భక్తా ..ఏమి కావలెను'' అని పాతదేవుళ్లు అడిగేవారు. ఇప్పుడు దేవుళ్లు రూపాంతరం చెందుతున్నారు కదా! కుల, మతాల పేరుతో వీధికో గుడి, కాలనీకో మందిరంలా అయిపోయింది పరిస్థితి. అంతా మోడ్రనాయే మరి. పాత కాలంలోనైతే నాకు అది కావాలి..ఇది కావాలి అంటూ ఏవో కోరుకునేవారనే కథలు, ముచ్చట్లు కామిక్ పుస్తకాలు, కామెడీ కథల్లోనూ సాధారణంగా వినే ఉంటాం. చదివాం కూడా. ఇప్పుడు 21వ శతాబ్ధం దేవుళ్లు ఆల్ట్రామోడ్రన్ కదా! కోరికలు సైతం కాస్త వెరైటీగానే ఉంటున్నయి సుమా!! భక్తా .. నీకు ఏమి కావలెను ? అంటే , ఇప్పుడు నాకు 'టీకా' కావాలి స్వామీ' అంటూ అమాంతం కాళ్లమీద పడే పరిస్థితి ఏర్పడింది. దేశంలో ప్రజలకు టీకాలేయకుండా విదేశాలకు పంపిన ఘనత మన ఢిల్లీ సర్కారుది. టీకా కోసం జనం ఎర్రటి ఎండల్లో కష్టపడుతుంటే, వేగిరంగా ఉత్పత్తి చేయడానికి ఒక్కటంటే ఒక్కటి గవర్నమెంట్ కంపెనీ లేదాయే! హతవీధి...!! ఇది ఏమి పాలన..!?
-బి. బసవపున్నయ్య