Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హెచ్చిడికి పోతే ఏమైతదో ఇటీవల ఆయా రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలే చెబుతున్నరు ! గంత గానం ఏముందుర్రో అనుకుంటున్నరా ఏందీ !! టీకా రేటు ఎందుకు తగ్గిందనుకున్నరు. ఎన్నికల్లో బీజేపీ భరతం బట్టిరి ప్రజలు. గూబ గుయ్యిమనిపించిరి మరీ. ప్రజా వ్యతిరేక విధానాల అమలు, ఇటీవల కాలంలో మన పెద్దాయన గడ్డం వేషాలు చూసి జనానికి చిర్రెత్తబట్టే. గందుకే గుద్దు గుద్దితే బొక్కా బోర్లా పడే మన ప్రధాని. చివరకు కోవిడ్ టీకాలను ఫ్రీగానే ఏంతమని చెప్పాల్సి వచ్చే. అంతేగాక నిర్మలమ్మ నిన్న జీఎస్టీ కౌన్సిల్లో కరోనా మందులు, పరికరాలకు పన్ను కూడా తగ్గించాల్సి వచ్చే. హత విధి.
- బి. బసవపున్నయ్య