Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా కష్టకాలంలో జనానికి ముఖం చాటేసిన దేవుడు మళ్లీ లేస్తున్నాడు. గుడి, మశీదు, చర్చి సహా అన్ని ప్రార్థనా మందిరాలూ లాక్డౌన్లో మూతపడ్డాయి. దేవుళ్లు సైతం ఎక్కడివాళ్లు అక్కడే ఉండిపోయారు. తమ భక్తుల్ని కాపాడేందుకు ఒక్క అడుగు కూడా ముందుకేయలేదు. ఏదో ఆ డాక్టర్లే తిప్పలు పడి జనాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఆపత్కాలంలో ప్రాణాలు కాపాడుతున్న డాక్టర్లే దేవుళ్లయితే... జనాన్ని గొర్రెల్ని చేసేదెట్టా అనే డౌటనుమానం మన బీజీపీ వాట్సప్ యూనివర్సిటీ ప్రిన్సిపాల్‌కు వచ్చినట్టుంది. పొద్దున లేవగానే సుప్రభాత గుడ్మార్నింగులతో మొదలెట్టి, ఆ గుడికి ఆ మహాత్యం, ఈ బాబాకు అక్కడ ముట్టుకుంటే అదృష్టం అంటూ మొదలెట్టి, మధ్యమధ్యలో చైనా, నేపాల్ సరిహద్దుల్లోని గుళ్లు, గోపురాల ప్రస్తావన తెస్తూ, దేశ, దైవభక్తిని ఉప్పొంగించే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి కనీసం ఇలాంటి మానసిక దౌర్భల్యం ఉన్నవాళ్లన్నా తమకు ఓటేయకపోతారా అన్నట్టు తెగ ఆపసోపాలు పడుతున్నారు. కరోనా దెబ్బకు దేవుడే దాక్కుంటే, ఇదేం గోలరా అయ్యా అంటే సప్పుడు సెయ్యరే... ఈ సన్నాసులు! రాజకీయాల్ని మళ్లీ దేవుడి చుట్టూ తిప్పాలనే తాపత్రయం మళ్లీ మొదలెట్టార్రా అయ్యా ఈళ్లు!!
-ఎస్ఎస్ఆర్ శాస్త్రి