Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గిప్పుడు హస్తినా నుంచి ఆగ్రా దాకా... దక్షిణ పక్క నుంచి ఉత్తర దిక్కు దాకా ఒక్కటే ముచ్చట నడుస్తంది. గదేంటంటే... గుండు యోగి సాబ్... మన గడ్డం భోగి సార్ కొట్లాడుకుంటున్నరట. ఇద్దరు ఒక్క ''పరివారం'' ముక్కలే కదా! కొత్తగ గీల్లు కొట్లాడుకునుడేందని కలవరవడేరు జర. గాళ్ళిద్దరు గీ మధ్య గట్టిగనే యుద్ధం చేసుకుంటున్నరని పెపంచమంతా బహిరంగంగానే టాకుతుంది లే. అరే వర్రీ కాకుర్రీ, జర చెప్పేదాక కూడ ఆగరా ఏందీ? ఆ యుధాలతో కాదులే... అధికారంతోనే. గడ్డం సారు చెప్పిన ఓ మనిషికి మంత్రి పోస్టు ఇవ్వమంటే... లేదు ఎవ్వర్నీ తీసుకోను అంటే తీసుకోనని అంటండట మన యోగి సాబ్. అరే గట్లెట్ల తీసుకోవు మిత్రోమ్, ఎక్కన్నో గోరఖ్పూర్ మఠంలో పూజలు జేసుకునే నిన్నే నేను తీసుకొత్తి. గిప్పుడు నా మాటే ఇనవా ఏందీ? అంటూ సంఫ్ుపరివార సైన్యాన్ని అంతా ఒక్కటి జేసి నీ కథేందో సూత్తనని సవాళ్ళు జేసిండంట మన గడ్డం భోగి సారు. హ... పీకినవ్ తీరు. ఏంజేత్తవో జేసుకో అన్నట్టు గీయన గమ్మున ఉంటండట. తానే ఈ దేశానికి (అరే దేశమేందుల్లా మొన్న అమెరికా కూడా పోయి ట్రంప్ గెలిపిద్దామని అక్కడంతా కంపు జేసి బొక్కబోర్లపడలేదా) చక్రవర్తినని అనుకొని గడ్డం కిలోమీటర్ పొడుగు పెంచే గుజరాత్ తాతకి తన పెరట్లనే అసమ్మతి మొలక పుడితే ఇగ మనసున వడతా. గిప్పుడు దేశ పాలన ఇడిసిపెట్టి గా పని మీదనే ఉన్నడట పెధాని సార్ మొత్తానికి. అయినా ఈ యోగి... భోగి లొల్లితో జనానికి ఏమైనా పైసా ఫాయిదా ఉందా? అని మా మల్లయ్య తాతతో అంటే... గదేరా పిలగా గా అచ్చే ఎలక్చన్ల ఆ లొల్లితో పువ్వొల్లు ఓడిపోతే గీ పెట్రోలు, గ్యాసు, నూనె పాకిట్ల ధర అయినా తగ్గుతాయట కదరా అని మా తాత జెప్పవట్టే. అరే, తాతకున్న ఆలోచన నాకు లేకపాయే అని తల బండకి కొట్టుకునుడు నా వంతాయే. గీది కొట్లాట కథ... తాత వ్యథ!
- సాగర్ వనపర్తి