Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గా బీజేపీల ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగి మధ్య లొల్లి నడుస్తున్నదని ఆ పార్టీలనే ఆడా, ఇడ ముచ్చట నడుస్తున్నది. కాబోయే ప్రధాని యోగి అని కాషాయవర్గాల్లో జరుగుతున్న ప్రచారం పట్ల మోడీకి గిట్టడం లేదట ! దీంతో నదిలో కరోనా శవాల ఘటనలను అడ్డంపెట్టుకుని యోగికి ఎసరు పెట్టి ఇంటికిపంపాలని మోడీ చూస్తున్నడట. యూపీలో దేశంలోకెల్ల ఎక్కువ మంది కరోనా రోగులు చావబట్టిరి. యోగి సర్కారు వైద్యం అందించలేకపోతున్నట. గా బీజేపోళ్లే చెప్పబట్టిరి సుమా ! పూర్తిగా మూఢ నమ్మకాలకు ప్రొత్సహిస్తున్న యోగి ప్రభుత్వానికి ఇప్పటి పరిస్థితులు ముందు నుయ్యి..వెనుక గొయ్యిలా తయారైనట్టు చాటుకుపోయి మరీ చెప్పుకుంటున్నరు కమలం కాకలు. త్వరలోనే యోగిని శంకరగిరి మాన్యాలకు పంపించి పార్టీలో శత్రుశేషం లేకుండా చూసుకోవాలని మోషా ద్వయం భావిస్తున్నదట. పదవులు, పవర్ యావ తప్ప జనం గురించి పట్టించుకోరైరి మోడీ, యోగిలు. జమజైదనుకుంట. ఉంట మరి !!
-బి. బసవపున్నయ్య