Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా మహమ్మారి దెబ్బకు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం పెరిగింది. తింటున్న తిండిలో లభించే పోషకాలు మొదలు ఆయా మందులపై సామాన్యుల మధ్య చర్చలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అంతకు ముందు వినోదానికి ఎక్కువగా సమయం కేటాయించే నెటిజన్లు సైతం ఆరోగ్యం-ఆహరంపై చర్చిస్తుండటం శుభపరిణామంగా మేధావి వర్గం భావిస్తున్నది. ఇలాంటి చర్చ అంతిమంగా ప్రజారోగ్య వ్యవస్థ బలోపేతానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అదే సమయంలో అశాస్త్రీయ విధానాలకూ, మూఢ నమ్మకాల ప్రచారానికీ సామాజిక మాధ్యమాలే వేదికగా మారుతుండటం పట్ల ఆందోళన వ్యక్తమవుతున్నది. ఆరోగ్యం విషయంలో సరైన సమాచారం ఇచ్చేందుకు ఉపయోగపడాల్సిన సామాజిక మాధ్యమాలు కొన్ని సార్లు తప్పుడు సలహాల వ్యాప్తికి కారణమవుతున్నాయి. ప్రజలకు హాని చేసే తప్పుడు సమాచారం అరికట్టేందుకు, శాస్త్రీయ అవగాహన కల్పించేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ చూపించాలని మేధావులు సూచిస్తున్నారు. పెద్ద ఎత్తున ప్రభుత్వం నుంచి శాస్త్రీయ సమాచారం వస్తే తప్ప ఇలాంటి వాటికి అడ్డుకట్ట పడే అవకాశం కనిపించటం లేదు. ప్రభుత్వాలకు వినిపిస్తుందా?.....
-కె.ప్రియకుమార్