Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్రంలో రాజకీయం రంగు మారబట్టె..! ఇందుకు కేసీఆర్ రింగు తిప్పబట్టే..! దళితుల ఎంపవర్మెంట్ కోసం ఆదివారం నాడు ముఖ్యమంత్రి రౌండ్‌టేబుల్ మిటింగ్ పెట్టిండు. దీంతో ఇప్పుడు ఫోకస్ అంతా ప్రగతిభవన్వైపే ఉంది. నేతలకు ఫోన్లు జేసి మరీ రావాలనీజెప్పి, మధ్యాహ్నా భోజనం కూడా పెట్టబట్టే. అందులో తునకలు కూడా ఉన్నయట సుమా! ఇంటలిజెన్స్ సమాచారం మరీ!! మరియమ్మ లాకప్‌డెత్‌పై ప్రతిపక్షాల ఫిర్యాదులు గవర్నర్‌కు పోబట్టే. ఆ తలనొప్పి ఎందుకని అడిగినవెంటనే అపాయింట్మెంట్ ఇచ్చి మరీ దళిత ప్రజాప్రతినిధులు, రాజకీయపార్టీల నేతలు, దళిత సంఘాల నేతలనూ పిలవబట్టే. దీంతో మీడియా దృష్టంతా అటు మళ్లబట్టే. దొరికిందే ఛాన్సనీ అంతా తెల్లకాగితాల మీద నల్ల గీతలేసుకుని నేతలు దరఖాస్తులు చేతబట్టిరి. ఏం జరుగుతదో, భవన్ నుంచి ప్రెస్‌నోట్ ఏమొస్తదో చూడాలే మరి !!
- బి.బసవపున్నయ్య