Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై పన్నుల భారాన్ని విపరీతంగా మోపుతున్నాయి. పెట్రోలు ధర విపరీతంగా పెంచి లీటరుకు రూ.100కు పైగా వసూలు చేస్తున్నారు. అదే విధంగా గ్యాస్ ధర గత సంవత్సరం రూ.50లు, ఈ సంవత్సరం రూ.25లు అదనంగా పెంచటం జరిగింది. విద్యుత్ బిల్లులూ ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నారు. దీనివల్ల ఇంటి యజమానులకు అద్దె బకాయిలు సమస్యలు తలెత్తుతున్నాయి. నిత్యావసర ధరలు సైతం నియంత్రణ లేకుండా పోవటంతో ఆకాశానికి ఎగబాకుతున్నాయి. వంటనూనె ధరలు విపరీతంగా పెరిగాయి. కరోనా కాలంలో పనులూ ఆదాయాలూ కోల్పోయి అవస్థలు పడుతున్న సామాన్య, మధ్య తరగతి జనాలకు ఈ పన్నుల భారం శాపంగా మారింది. రానున్న కాలంలో ఇంటిపన్ను భారాన్ని మోపే ప్రమాదమూ పొంచి ఉంది. ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది ఒకటి. సంపన్నులనొదిలి సామాన్యులపై పన్నుల మోత మోగిస్తున్నారు.
- ఎ.ఆర్.ఆర్.రావు, ఖమ్మం.