Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత దేశం ఏటా 88.2 బిలియన్ లీటర్ల డిజీల్ 37.2 బిలియన్ లీటర్ల పెట్రోల్ వినియోగయంచేస్తున్నాం. దేశంలో రోజుకు మార్చి 21 నాటికి 4,957 బ్యారల్స్ రోజుకు వినియో గిస్తున్నాం. 2020-22 నాటికి డీజిల్ వాడకం 14 శాతం, పెట్రోల్ వాడకం 10 శాతం పెరుగు తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశీయ ఉత్పత్తిపోగా 205.3 మిలియన్ మెట్రిక్ టన్నుల క్రుడ్ ఆయిల్‌ను దిగుమతి చేసుకున్నాం. (2019). అలాగే ఇరాక్, సౌదీ అరేబియా, నైజిరియా, యునైటేడ్ అర్బబ్ ఎమిరెట్స్‌తో పాటు మరో 11 దేశాల నుండి దిగుమతులు చేసుకుంటున్నాం. దిగుమతి కింద కోట్లాది రూపాయలు వ్యయం చేస్తున్నాం. విదేశీ మారక ద్రవ్యాన్ని తగ్గించుకోవాలని ప్రభుత్వం ఆశిస్తే ఇథనాల్ ఉత్పత్తిని దేశీయంగా పెంచాలి. ప్రస్తుతం 10 శాతం ఇథనాల్ పెట్రోల్, డీజిల్‌లో కలుపుతున్నారు. అంత మేరకు దిగుమతులు తగ్గుతున్నాయి. బ్రెజిల్, అమెరికా 25 నుండి 30 శాతం ఇథనాల్‌ను పెట్రోలియంలో కలుపుతున్నారు. వారు ఉత్పత్తి బాగా చేస్తున్నారు. మనకు అవకాశాలు ఉన్న ఇథనాల్ ఉత్పత్తి చేసుకోలేకపోతున్నాం. ప్రధాని మోడీ ఆహార ధాన్యాలను (బియ్యం) వినియోగించి ఇథనాల్ ఉత్పత్తి చేయడానికి అంగీకరించారు. ఇది అత్యంత ప్రమాదకరమైన నిర్ణయం. ఒకవైపున ఆహార ధాన్యాలు దేశీయ అవసరాల మేరకు ఉత్పత్తి కావడం లేదు. 2021లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 301.5 మిలియన్ టన్నులు జరిగినట్లు వ్యవసాయశాఖ 3వ అంచనాలు వేసింది. జనాభా 139 కోట్లకు చేరుకుంది. ఆహార ధాన్యాలలో బియ్యం, గోదుమలు, పప్పులు, ముతక ధాన్యాలు చేరి ఉన్నాయి. ఆహర ధాన్యాల కొరత ఉన్న భారత దేశంలో ఆహార ధాన్యాల నుండి ఇథనాల్‌ను తయారు చేయడం అత్యంత ప్రమాదకరమైన విధానం. ఇథనాల్ ఉత్పత్తి చేయడానికి చెరుకు, ఆయిల్ ఫాం తదితర పంటల నుండి అధికంగా ఉత్పత్తి చేయవచ్చు. ఆ పంటల విస్తీర్ణన్ని పెంచాలి. కానీ భారత ప్రభుత్వం 2015 నుండి చెరుకు విస్తీర్ణన్ని 5 కోట్ల ఎకరాల నుండి 2.5 కోట్ల ఎకరాలకు తగ్గించింది. ప్రస్తుతం ఆయిల్ పాం తోటలను పెంచాలని ప్రయత్నం చేస్తున్నారు. మోలాసీస్ నుండి ఇథనాల్ తయారు చేస్తారు.
2020-21 మోలాసిస్ ఉత్పత్తి వివిధ దేశాల్లో ఈ విధంగా ఉంది. (మిలియన్ గ్యాలన్స్) గ్యాలన్ = 4.536 లీటర్లు :
అమెరికా-3,800, బ్రెజిల్ -7,930, యూరోపియన్ యూనియన్ -1,250, చైనా - 880, భారత్ - 480, కెనాడా - 460, థాయిలాండ్ - 400, అర్జంటీనా - 230, మిగిలిన దేశాలు - 500
2020-21లో భారత దేశంలో
పంటల ఉత్పత్తి ఈ విధంగా ఉంది.
బియ్యం 12.14 కోట్ల టన్నులు
గోధుమలు 10.87 కోట్ల టన్నులు
మొక్కజొన్నలు 3.00 కోట్ల టన్నులు
పప్పులు 2.55 కోట్ల టన్నులు
నూనె గింజలు 3.65 కోట్ల టన్నులు
చెరుకు 39.27 కోట్ల టన్నులు
పత్తి 3.64 కోట్ల టన్నులు
జూట్ 0.96 కోట్ల టన్నులు
2020-21లో ప్రపంచంలో
ఉత్పత్తి మిలియన్ మెట్రిక్ టన్నులు
మొక్కజొన్నలు-1125,గోధుమలు-775.8, బియ్యం-505 మిల్లింగ్, జొన్నలు-62.05, ఓట్స్-25.53, రై -14.3
ఈ ఉత్పత్తిలో ఇతర దేశాలు మొక్కజొన్నలు, చెరుకు, ఆయిల్ ఫాం పంటల నుండి మోలాసిస్ ద్వారా ఇథనాల్ తయారు చేస్తున్నారు. చాలా దేశాలు పెట్రోలియం దిగుమతులను తగ్గించుకొని విదేశీ మారక ద్రవ్యాన్ని మిగుల్చుకుంటున్నారు. కానీ భారత ప్రభుత్వం అంతా సుముఖంగా లేదు. అమెరికా, బ్రెజిల్ దేశాలు కూడా మన దేశానికి పంచధార, పామాయిల్ దిగుమతులు చేయడానికి ఉత్సాహం చూపుతున్నాయి. ప్రస్తుతం భారత ప్రభుత్వం 1.30 కోట్ల టన్నులు వంటనూనెలు దిగుమతి చేసుకుంటున్నాయి. కనీసం దిగుమతులనైన తగ్గించుకోవటానికి బీడు భూములలో అయిల్ ఫాం తోటలు వేయవచ్చు. గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వం ప్రకటించడమే తప్ప తోటల విస్తరణ పెరగలేదు. ప్రస్తుతం భారత దేశంలో 7.5 లక్షల ఎకరాలలో ఫామాయిల్ తోటలు ఉన్నాయి. కనీసం 30 లక్షల ఎకరాలకు వీటిని పెంచవచ్చు. ఎకర సబ్సిడీ మొదటి సంవత్సరం రూ.26,000, రెండో సంవత్సరం రూ.5,000, మూడవ సంవత్సరం రూ.5,000 ఇవ్వటానికి పథకాలు రూపొందించారు. నిధులు విడుదల చేశారు. అయినా ఆర్టికల్చర్ శాఖ, వ్యవసాయశాఖ ప్రోత్సాహం లేకపోవడంతో ఆయిల్‌ఫాం తోటల విస్తరణ పెరగడం లేదు. ఆయిల్‌ఫాం ఉత్పత్తులలో ఏ ఒక్కటి వృదా కాదు. విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుంది. ప్రపంచంలో అన్ని పంటలకన్న మొక్కజొన్న పంటల ఉత్పత్తికి ప్రాధాన్యత ఇస్తున్నారు. భారత్‌లో 3 కోట్ల టన్నుల మొక్కజొన్నలు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. మనకన్న సాగు భూమి తక్కువ ఉన్న అమెరికాలో 36 కోట్ల టన్నులు, చైనాలో 26 కోట్ల టన్నులు, బ్రెజిల్లో 9.85 కోట్ల టన్నులు, యూరోపియన్ యూనియన్‌లో 6.40 కోట్ల టన్నులు, అర్జంటీనాలో 4.70 కోట్ల టన్నులు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ పంట ద్వారా పీడ్, బిస్కేట్లు, ఆల్కహాల్, ఇథనాల్, బయో డీజిల్ తయారు చేసి దేశ అవసరాలకు వినియోగిస్తున్నారు. ఇప్పటికైనా భారత ప్రభుత్వం ఆయిల్‌ఫాం, చెరుకు, మొక్కజొన్న విస్తీర్ణాన్ని బాగా పెంచి ఇథనాల్ ఉత్పత్తి చేసి పెట్రోలియం దిగుమతులను తగ్గించుకొని విదేశీ మారక ద్రవ్యాన్ని మిగుల్చుకోవాలి.
- సారంపల్లి మల్లారెడ్డి
సెల్:9490098666